దౌత్యవేత్త పట్ల అగ్రరాజ్య అధికారుల ప్రవర్తన పై భారత్‌ ఆగ్రహం

న్యూఢిల్లీ: భారత దౌత్యవేత్త దేవయాని కోబ్రగాదె పట్ల అమెరికా అధికారులు ప్రవర్తించిన తీరుపై భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న యూఎన్‌ దౌత్యవేత్తలను వారి గుర్తింపుకార్డులు తిరిగి ఇచ్యేయవలసిందిగా ఆదేశించడమే కాక, భారత్‌ సందర్శిస్తున్న యూఎస్‌ కాంగ్రెస్‌ ప్రతినిధులతో భారత్‌ ప్రముఖుల సమావేశాలను కూడా రద్దు చేశారు. వీసా అవకతవకల ఆరోపణలతో దేవయానిపై కేసు నమోదు చేసిన యూఎన్‌ అధికారులు అరెస్టు సమయంలో సంకెళ్లు వేయడం, విచారణ సమయంలో దుస్తులు విప్పించి తనిఖీలు చేయడం,వ్యసనపరులు, హత్యానేరాలు ఎదుర్కొంటున్న వారితో పాటు ఒకే గదిలో ఉంచడం లాంటి చర్యలపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, హోంమంత్రి షిండే, భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ భారత పర్యటనలో ఉన్న యూఎన్‌ కాంగ్రెస్‌ ప్రతినిధులతో భేటీలను రుద్దు చేసుకున్నారు.