రాష్ట్రాల ఏర్పాటులో విజ్ఞతతో వ్యవహరించాలి: రాష్ట్రపతి

ఢిల్లీ: పెరుగుతున్న జనాభా, అవసరాల రీత్యా న్రజలందరినీ ఒకే చోట కలిపి ఉంచడం సాధ్యం కాదని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు వివిధ ప్రాంతాల నుంచి డిమాండ్లు వస్తున్నాయన్న ఆయన రాష్ట్రాల ఏర్పాటులో రాజకీయంగా, పరిపాలనా పరంగా విజ్ఞతతో వ్యవహరించాలన్నారు. ఈ రోజు ఢిల్లీలో జరిగిన నిఘావర్గాల అధికారుల సమావేశంలో రాష్ట్రపతి మాట్లాడారు. ఉగ్రవాదాన్ని సమర్థంగా తిప్పికొట్టేలా నైపుణ్యాలను పెంచుకోవాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.