జస్టిస్‌ గంగూలీ విషయంలో న్యాయశాఖ సలహా కోరిన హోం శాఖ

ఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్‌ ఏకే గంగూలీ విషయంలో చర్య తీసుకోవడంపై కేంద్ర హోం శాఖ న్యాయశాఖ సలహా కోరింది. పశ్చిమబెంగాల్‌ మానవహక్కుల సంఘం ఛైర్మన్‌గా ఉన్న జస్టిస్‌ గంగూలీపై చర్య తీసుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ రాష్ట్రపతికి లుఖ రాశారు. రాష్ట్రపతి ఆ లేఖను కేంద్ర హోం శాఖకు పంపగా, హోంశాఖ న్యాయశాఖ సలహా కోరింది. న్యాయశాఖ సలహా మేరకు తదుపరి చర్యలు ఉంటాయని హోంమంత్రి షిండే గురువారం తెలిపారు.