యువతి అనుమానాస్పద మృతి
విద్యాధరపురం(విజయవాడ): విజయవాడలోని విద్యాధరపురం సితార సెంటర్‌కు చెందిన బోయ నందిని(19) అనే యువతి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. కుటుంబసభ్యులు, ఒకటో పట్టణ పోలీసుల కథనం ప్రకారం అదే ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ ఇరుసు దురారావు, నందిని మధ్య గత కొంత కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భవతి. విషయం ఇంట్లో తెలుస్తుందన్న భయంతో దార్గారావు ఇచ్చిన గర్భనిరోధక మాత్రలను వేసుకున్న ఆమె మాత్రలు వికటించడంతో తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. నిందితుడు దుర్గారావునేను ఒకటో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.