ప్రముఖ కన్నడ కవి శివరుద్రప్ప కన్నుమూత

బెంగళూరు : ప్రముఖ కన్నడ కవి, పరిశోధకులు జి. ఎన్‌. శివరుద్రప్ప(87) సోమవారం ఉదయం బెంగళూరులోని స్వగృహంలో కన్ను మూశారు. ఆయన కొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆయనను 2006 సంవత్సరంలో ‘రాష్ట్రకవి’ బిరుదుతో సత్కరించింది. ఈ బిరుదు పొందిన మూడో కవి ఆయన. 1951లో తొలి కవితా సంపుటి ‘సమగాన’ నుంచి 1999లో చివరి సంపుటి ‘వైకటమధ్య’ వరకు ఆయన మొత్తం 13 కవితా సంపుటాలు ప్రచురించారు. ప్రభుత్వం ఆయనను ‘పంప ప్రశతి’ అవార్డుతోనూ సత్కరించిండం విశేషం. 1984లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న శివరుద్రప్ప కన్నడ ప్రొఫెసరుగా పనిచేశారు.