ఫాస్ట్‌ఫుడ్‌ తీసుకోవద్దని సిబ్బందికి మెక్‌ డొనాల్డ్స్‌ హెచ్చరిక

ఢిల్లీ : బర్గర్లు, పిజ్జాలు విక్రయించే ఫాస్ట్‌ఫుడ్‌ చెయిన్‌ మెక్‌ డొనాల్డ్స్‌ ఫాస్ట్‌ ఫుడ్‌ తినవద్దని స్వయంగా తన సిబ్బందిని హెచ్చరిస్తోంది. సిబ్బందికి సంబంధించిన వెబ్‌సైట్లో సంస్థ ఈ హెచ్చరికలు చేసింది. బిజీ ఉద్యోగులకు ఫాస్ట్‌ ఫుడ్‌ ఎంతో అనువుగా ఉంటుందని, చౌకగా లభిస్తుందని, ఇంట్లో తయారైన ఆహారానికి మంచి ప్రత్యామ్నాయమని పేర్కొంటూనే అది ఆరోగ్యానికి ఎందుకు మంచిది కాదో కూడా మెక్‌ డొనాల్డ్స్‌ తెలియజేసింది. ఫాస్ట్‌ఫుడ్‌లో కెలొరీలు, కొవ్వుపదార్థాలు, చక్కెర, సోడియం లాంటివి ఎక్కువగా ఉంటాయని,వీటి వల్ల స్థూలకాయం వస్తుందని తెలిపింది. స్థూలకాయం పలు అనారోగ్యాలకు మూలకారణమవుతున్న నేపథ్యంలో అది రాకుండా చూసుకోవాలని, ఫాస్ట్‌ ఫుడ్‌కి దూరంగా ఉండాలని సిబ్బందికి మెక్‌ డొనాల్డ్స్‌ సూచించింది.