న్యాయవాది ఇంట బాలికకు అన్యాయం

ఉజ్జయిని : తొమ్మిదో తరగతి చదివే ఒక బాలిక కులం సర్టిఫికెట్‌ కోసం తన ఇంటికి రెండు ఇళ్ల అవతల ఉన్న ఒక న్యాయవాది ఇంటికి వెళ్లింది. ఐదుపదులకు చేరువవుతున్న వయసులో ఉన్న ఆ న్యాయవాది బాలికను పద్నాలుగు రోజులుగా తన ఇంట బంధించి ఉంచడమే కాక పలుమార్లు అత్యాచారం జరిపాడు. అతని భార్య కూడా అందుకు సహకరించింది. ఈ రోజు ఉదయం సహాయం కోసం బాలిక రోదనలు విన్న పక్కింటివారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. బిడ్డ అదృశ్యంపై కేసు పెట్టిన ఆమె తల్లిదండ్రులు తమ ఇంటికి కూతవేటు దూరంలోనే ఆమె నిర్భందంలో ఉందని తెలిసి నిర్ఘాంతపోయారు. పోలీసులు లాయర్ని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.