ఆసియాకప్‌ : విరాట్‌ కోహ్లి సెంచరీ

ఫతులా: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డేలో విరాట్‌ కోహ్లి కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 95 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో కోహ్లీకిది 19వ శతకం. బంగ్లాదేశ్‌పై మూడు సెంచరీ. రహనే సైతం దూకుడుగా ఆడుతూ 50 పరుగులు పూర్తి చేశాడు. 280 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన భారత్‌ 38 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 208 పరుగులు సాధించింది.