పత్తిబస్తాల కింద పడి ముగ్గురు చిన్నారులు మృతి
హైదరాబాద్: వరంగల్ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో నిల్వ ఉంచిన పత్తి బస్తాల కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన చిన్నారులను వేణు(7), విక్కీ(8), భద్రకాళి(10)లుగా గుర్తించారు.