సుబ్రతారాయ్‌పై సిరా దాడి
డబ్బు చెల్లించాల్సిందే : సుప్రీం
న్యూఢిల్లీ, మార్చి 4 (జనంసాక్షి) :
సహారా ఇండియా పరివార్ చీఫ్ సుబ్రతారాయ్‌పై ఓ న్యాయవాది సిరాతో దాడి చేశారు. సహారా కుంభకోణం కేసులో సుబ్రతారాయ్ కోర్టుకు హాజరవుతున్న సందర్భంగా నీవు దొంగవు అంటూ ఒక వ్యక్తి సుబ్రతారాయ్ ముఖంపై ఇంకు చల్లాడు. ఇంకు చల్లిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరయ్యేందుకు వచ్చిన సహారా చీఫ్ సుబ్రతారాయ్ సుప్రీం కోర్టుకు రాగా ఆయనపై ఆ వ్యక్తి సిరా చల్లాడు. ఆ వ్యక్తి సుబ్రతారాయ్ దొంగ అంటూ ఆవేశంతో ఆయన ముఖంపై నల్లసిరా చల్లాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన న్యాయవాది మనోజ్ శర్మగా పోలీసులు గుర్తించారు. నాలుగు రోజుల కస్టడీ అనంతరం మంగళవారం రాయ్‌ను కోర్టుకు తీసుకుని వచ్చారు.