తెలంగాణలో కేసీఆర్ ఆటలు సాగవు: దానం
హైదరాబాద్, మార్చి 7 : టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై మాజీ మంత్రి దానం నాగేందర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో కేసీఆర్ దొరల రాజ్యం తేెవాలని ప్రయత్నిస్తున్నారని శక్రవారం హైదరాబాద్‌లో దానం మీడియాతో అన్నారు. బడుగు, బలహీనవర్గాల వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్ని కేసీఆర్ ఇప్పుడు ఆ మాటను మరిచిపోయినట్టు ఉన్నారన్నారు. తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాగాంధీకే దక్కుతుందని ఆయన అన్నారు. కేసీఆర్ తెలంగాణలో ముఖ్యమంత్రి కావాలని, కొడుకును హోంమంత్రి చేయాలని, కూతురుకు, అల్లుడుకు మంత్రి పదవులు ఇవ్వాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని ఆయన అన్నారు. బలహీన వర్గాలకు చెందిన వ్యక్తినే తెలంగాణకు ముఖ్యమంత్రిని చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ ఆటలు ఇక తెలంగాణలో సాగవని దానం హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది దొరల తెలంగాణ కాదని, సామాజిక తెలంగాణ అని ఆయన అన్నారు. తెలంగాణలోకూడా కాంగ్రెస్ పార్టీని కాపాడుకునే సమయం ఆసన్నమైందని దానం అన్నారు. తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామన్న కేసీఆర్ మాట తప్పారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ జీవితంలో మాట మీద నిలబడే వ్యక్తి కాదన్నారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉన్నా, లేకున్నా, కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టంకడతారన్నారు. టీఆర్‌ఎస్‌ను విలీనం చేయాలా? వద్దా?, కాంగ్రెస్‌తో పొత్తు విషయమై కేసీఆర్ నిర్ణయించుకోవాలన్నారు. మతతత్వ పార్టీలతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి రేసులో తాను కూడా ఉన్నానని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.