హిమబిందు హత్యోదంతంపై మహిళ సంఘాల నిరసన
హిమబిందు హత్యోదంతంపై మహిళ సంఘాల నిరసన
విజయవాడ: విజయవాడలో దారుణహత్యకు గురైన సప్తగిరి గ్రామీణబ్యాంక్ మేనేజర్ భార్య హిమబిందు హత్యోదంతంపై వివిధ వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితులను నిర్భయ చట్టం కింద అరెస్టు చేసి ఉరి శిక్ష విధించాలంటూ వివిధ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బ్యాంక్ ఉద్యోగులు, మహిళా సంఘాలు బెంజ్ సర్కిల్ నుంచి పోలీసు కమిషనర్ కార్యాలయం వరకు ఆదివారం భారీ ర్యాలీ చేపట్టాయి. ఈ నెల 15న హిమబిందుపై కార్ డ్రైవర్ శుభాని ఆధ్వర్యంలో ఆరుగురు దారుణంగా లైంగిక దాడి చేసి పటమటలోని ఆమె నివాసంలోనే హతమార్చారు. ఎవరికీ అనుమానం రాకుండా వేరే ఇంటిలో మృతదేహన్ని దాచిపెట్టారు. తర్వాత బందరు కాలావలో పడేశారు. ఇంట్లో దొంగతనం చేసి కిడ్నాప్ చేసినట్లు నమ్మించారు. ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఘటనపై బాధితులు గవర్నర్‌కు ఫిర్యాదు చేసి విచారణ త్వరగా ముగించాలని బెజవాడ పోలీసులను ఆదేశించారు.