కేసీఆర్‌పై పోటీకి సిద్ధం: మోత్కుపల్లి
కేసీఆర్‌పై పోటీకి సిద్ధం: మోత్కుపల్లి
హైదరాబాద్: మల్కాజిగిరి లోక్‌సభ స్ధానం నుంచి తెరాస అధనేత కేసీఆర్‌పై పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెదేపా సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహలు వెల్లడించారు. ఈ మధ్య కాలంలో కేసీఆర్ మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తున్నట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నాయని, ఇది కావాలని చేస్తున్నారా లేక నిజంగానే పోటీ చేస్తున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి నుంచి పోటీ చేసి కేసీఆర్ అన్యాయాలు, అక్రమాలు ప్రజలకు వివరించి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తంచేశారు.