77వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భముగా శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి (గౌరవ మంత్రివర్యులు రోడ్లు & భవనాలు, శాసనసభ వ్యవహారాలు మరియు గృహ నిర్మాణ శాఖ) పూర్తి ప్రసంగం
77 వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భముగా జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు, అధికారులకు, మీడియా మిత్రులకు నా శుభాకాంక్షలు మరియు విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీస్సులు.
స్వాతంత్ర్యం సిద్ధించి 76 సంవత్సరాలు పూర్తి అయినది. ఈ 76 సంవత్సరాలలో భారతదేశం అనేక రంగాలలో అభివృద్ధి సాధిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని నిరూపించుకుంటూ ప్రపంచ దేశాలకు తమ సత్తా చాటిచెప్తూ ముందుకు సాగుతున్నది. ఈ సందర్భముగా స్వాతంత్ర్యం కొరకు జీవితాలను త్యాగం చేసిన వారిని ఒకసారి స్మరించుకొనుట మన విధి. స్వాతంత్ర్యం ఏర్పడే నాటికి భారత దేశం చిన్న చిన్న రాష్ట్రాలుగా విభిన్న భాషలు, విభిన్న ప్రాంతాలు మరియు వ్యక్తుల మధ్య అసమానతలతో నిండి యున్నది. స్వాతంత్ర్యం అంటే ప్రతి పౌరుడికి కనీస సౌకర్యాలైన కూడు, గూడు, గుడ్డ లభించేలా ఉండడం తమ కాళ్ళపై తాము స్వేచ్ఛాయుతంగా ఎదగడం.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్రం అనేక రంగాలలో సంక్లిష్ట పరిస్ధితులను ఎదుర్కొంటూ ఉన్నది. అలాంటి పరిస్థితుల నుండి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను అభివృద్ధి పథం వైపు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు గారు ముందుండి నడిపిస్తూ ఉన్నారు. నేడు రాష్ట్రం వ్యవసాయ రంగంలో దేశంలోనే ఉన్నత స్థానానికి చేరింది. అలాగే సంక్షేమానికి మరియు అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ దేశంలోనే రాష్ట్రం ముందంజలో ఉన్నది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలైన రైతు ఋణ మాఫీ, గృహలక్ష్మి, ముస్లిం, మైనారీటి మరియు వెనుకబడిన తరగతుల వారికి రూ.1 లక్ష ఆర్థిక సహాయం, దళిత బంధు, రైతుబంధు, రైతుభీమ, కే.సి.ఆర్. కిట్టు, కంటి వెలుగు, కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్, ఆసర పెన్షన్లు, గొర్రెల పంపిణి, చేపలు మరియు రొయ్యల పంపిణి, ధరణి మొదలైనవి అమలు అవుతున్నాయి. ఈ జాతీయ పండుగ సందర్భంగా జిల్లాలో సాధించిన ప్రగతిని మీ ముందు ఉంచుతున్నాను.
1. వ్యవసాయ రంగం
వానాకాలం 2023 లో ఇప్పటి వరకు వరి 3,90,564 ఎకరాలలో, మొక్క జొన్న 38,411 ఎకరాలలో, సోయాబీన్ 50,187 ఎకరాలలో, పసుపు 20,477 ఎకరాలలో మరియు ఇతర పంటలు కలుపుకొని మొత్తం 5,00,285 ఎకరాలలో రైతులు పంటలు సాగు చేయుచున్నారు.
ఋణ మాఫీ పథకం: క్రింద 01-04-2014 నుండి 11-12-2018 వరకు మంజూరు లేదా పునరుద్దరణ చేయబడిన పంట ఋణాలు అర్హత కలిగి ఉన్నాయి. అర్హత కలిగి ఉన్న కుటుంబానికి ప్రిన్సిపల్ మరియు వడ్డీ తో కలిపి లక్ష రూపాయల వరకు మాఫీ చేయడం జరుగుచున్నది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 23,444 మంది రైతులకు రూ 44.65 కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది.
రైతు బంధు పథకం: జిల్లాలో 2018-19 సంవత్సరం నుండి వానాకాలం 2023 వరకు 2,60,617 మంది రైతులకు 2616.90 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది. వానాకాలం 2023 కు గాను ఇప్పటి వరకు 231.18 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది.
రైతు బీమా పధకము: జిల్లాలో 2022-23 లో చనిపోయిన 831 రైతుల యొక్క నామినీ ఖాతాలలో రూ.41.55 కోట్లు జమ చేయడం జరిగింది. 2023-24 పాలిసీ సంవత్సరముకు గాను జిల్లాలో అర్హత కలిగిన 1,62,992 రైతులను రైతు బీమా లో నమోదు చేయించడం జరిగింది.
ఎరువుల సరఫరా: వానాకాలం 2023 కు అవసరమైన ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఇప్పటి వరకు 35,353 మెట్రిక్ టన్నుల యూరియా, 13,093 మెట్రిక్ టన్నుల డి.ఎ.పి, 570 మెట్రిక్ టన్నుల పొటాష్ మరియు 21,367 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు రైతులకు సరఫరా చేయడం జరిగింది. ప్రస్తుతం 37,087 మెట్రిక్ టన్నుల యూరియా, 11,669 మెట్రిక్ టన్నుల డి.ఎ.పి, 2,522 మెట్రిక్ టన్నుల పొటాష్ మరియు 39,630 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు నిలువ ఉన్నవి.
పంట నష్ట పరిహారం: జిల్లాలో మార్చ్ 2023 లో కురిసిన అధిక వర్షాలకు 467.14 ఎకరాలలో పంట నష్టపోయిన 371 రైతులకు రూ 46.73 లక్షల పంట నష్ట పరిహారం రైతుల బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేయడం జరిగింది మరియు జిల్లాలో ఎప్రిల్ 2023 లో కురిసిన అధిక వర్షాలకు 9170.38 ఎకరాలలో పంట నష్టపోయిన 8702 రైతులకు రూ 9.17 కోట్ల పంట నష్ట పరిహారం మంజూరు చేయడం జరిగింది. ఈ పరిహారం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలలోకి జమ చేయడం జరుగుతుంది.
2. ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ:
2023-2024 సంవత్సరములో 4,600 ఎకరములలో ఆయిల్ పామ్ సాగు చేయుట మరియు బిందు సేద్యం ఏర్పాటు చేయుటకు నిర్ణయించనైనది. ఇంతవరకు 1544 ఎకరాలకు పరిపాలన ఆమోదము ఇవ్వనైనది. ఇప్పటివరకు 950 ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలు నాటడం జరిగినది.
3. మత్స్య శాఖ:
ప్రస్తుతం జిల్లాలోని మొత్తం 362 ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు 22,938 మంది సభ్యులు కలరు. 2022-23 సంవత్సరమునకు గాను 986 చెరువులలో 458.77 లక్షల చేప పిల్లలను వదలడము జరిగింది. దానికి గాను 460.76 లక్షలు వెచ్చించడము జరిగింది. రొయ్య పిల్లల విడుదల కార్యక్రమము లో భాగంగా SRSP రిజార్వాయర్ మరియు 26 చెరువులలో మొత్తం 82.25 లక్షల రొయ్య పిల్లలను వదలడము జరిగింది. దానికి గాను 202.55 లక్షలు వెచ్చించడము జరిగింది.
నీలి విప్లవ పథకం: జిల్లాలో మొత్తం 06 ఫిష్ మార్కెట్స్ మంజూరైనవి, ఇందులో 45 లక్షల రూపాయలతో 05 ఫిష్ మార్కెట్లు పూర్తి చేయడం జరిగినది. ప్రస్తుతము డిచ్ పల్లి మండలములోని నడిపల్లి గ్రామములొ 50 లక్షల రూపాయలతో చేపల మార్కెట్ మంజూరు చేయడం జరిగినది. మరియు నిజామాబాద్ పట్టణములోని అర్సపల్లి నందు గల మత్స్య శాఖ కార్యాలయము నందు 2 కోట్ల రూపాయలతో హోల్ సెల్ కమ్ రిటైల్ ఫిష్ మార్కెట్ మంజూరు చేయడం జరిగినది.
4. పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ:
రాష్ట్ర ప్రభుత్వంచే ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న “గొర్రెల అభివృద్ధి పథకము’’ ద్వారా జిల్లాలో అర్హత కలిగిన గొల్ల, కుర్మ, యాదవులకు (75%) సబ్సిడీ తో గొర్రెల యూనిట్ల పంపిణీ చేయడం జరుగుచున్నది. 20 గొర్రెలు మరియు 1 పొట్టేలు గల యూనిట్ విలువ ఒక లక్ష 75 వేల రూపాయలు. జిల్లాలో Phase – I లో భాగంగా – 2017-18 ఆర్థిక సంవత్సరము నుండి ఇప్పటివరకు 10,722 యూనిట్లను అనగా 2,25,162 జీవాలను రూ. 139.355 కోట్ల వ్యయంతో లబ్దిదారులకి పంపిణీ చేయడం జరిగింది. Phase – II లో భాగంగా 8384 యూనిట్లను అనగా 1,76,064 జీవాలను రూ. 146.72 కోట్ల వ్యయంతో లబ్దిదారులకి పంపిణీ చేయడం కొరకు ప్రణాళిక తయారు చేయడం జరుగుతుంది. రెండవదశ లో భాగంగా 1880 లబ్దిదారుల వాటాచెల్లించి యున్నారు. వారిలో ఇప్పటివరకు 144 యూనిట్లు పంపిణీ చేయబడినవి.
5. పౌర సరఫరాల శాఖ:
ప్రజా పంపిణీ పథకం: జిల్లాలో మొత్తం 4,02,463 ఆహార భద్రత కార్డులు ద్వారా 12,87,095 మంది ప్రజలు లబ్ది పొందుతున్నారు. ప్రతి నెల సగటున 8,100 మెట్రిక్ టన్నుల ఉచిత బియ్యంను సరఫరా చేయడం జరుగుతుంది. జిల్లాలో ఆహార భద్రతా కార్డుదారులకు ఆగస్టు నెల నుండి చౌక ధరల దుకాణముల ద్వారా ఫోర్టిఫైడ్ బియ్యం కలిగిన బియ్యంను సరఫరా చేయబడుచున్నది. ఫోర్టిఫైడ్ బియ్యంలో పోశాకలైన ఐరన్, ఫోలిక్ యాసిడ్ మరియు విటమిన్ బి 12 నిర్ధారిత మోతాదులో కలుపబడి ఉంటుంది.
i. మధ్యాహ్న భోజనములో సన్నబియ్యం సరఫరా: జిల్లాలో మొత్తం 1,179 పాఠశాలలో, 1,17,147 విద్యార్థులకు ప్రతి నెల సగటున 214.550 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయబడుచున్నది.
ii. హాస్టల్లలో సన్న బియ్యం సరఫరా: జిల్లాలో మొత్తం 180 వివిధ కేటగిరీలకు చెందిన హాస్టల్ లు కలవు. అట్టి హాస్టల్లలోని 41,716 మంది విద్యార్థులకు ప్రతి నెల 359.165 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయబడుచున్నది.
iii. అంగన్ వాడి సెంటర్లకు పౌష్టికాలతో కూడిన బియ్యం సరఫరా: జిల్లాలో 1500 అంగన్ వాడి సెంటర్లలో 1,18,156 గర్భిణీ స్ర్తీలు మరియు పిల్లలకు ప్రతి నెల పౌష్టికాలలో కూడిన 111.950 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయబడుచున్నది.
iv. కనీస మద్దతు ధర పై ధాన్యం కొనుగోలు: 2022-23 వానాకాలం సీజన్ లో మొత్తం (467) కేంద్రాల ద్వారా 5,85,661.360 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని (79,077) రైతుల వద్ద నుండి కొనుగోలు చేసి రూ.1204.36 కోట్ల డబ్బులను రైతులకు ఇవ్వడం జరిగింది. అలాగే గడిచిన 2022-23 యాసంగి సీజన్ లో మొత్తం (460) కేంద్రాల ద్వారా 6,35,190.800 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని (84,173) రైతుల వద్ద నుండి ప్రభుత్వం ప్రకటించిన ధరలపై ధాన్యం కొనుగోలు చేసి రూ.1300.49 కోట్ల డబ్బులను రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగినది.
6. టి.ఎస్.మార్క్ ఫెడ్:
వానాకాలం 2023-24 సీజనులో జిల్లాలోని 89 సహకార సంఘాల ద్వారా 22,316 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు సరఫరా చేయడమైనది. ఇంకను 25,639 మెట్రిక్ టన్నుల ఎరువులను నిల్వ చేయడం జరిగింది.
శనగల కొనుగోలు వివరాలు:- 2022-23 యాసంగి సీజనులో జిల్లాలో 10 శనగ కొనుగోలు కేంద్రాల ద్వారా మొత్తం 80,222 క్విoటాళ్ల శనగలను 6,472 మంది రైతుల నుండి కొనుగోలు చేయడమైనది. వీటి విలువ రూ. 42.80 కోట్లు (ఒక క్విoటాలు ధర రూ.5,335/-).
ప్రొద్దు తిరుగుడు గింజల కొనుగోలు వివరాలు:- 2022-23 యాసంగి సీజనులో జిల్లాలో మార్కెఫెడ్ ఆధ్వర్యంలో 8 కొనుగోలు కేంద్రాల ద్వారా 33,932 క్విoటాళ్లను 2,676 మంది రైతుల నుండి కొనుగోలు చేయడమైనది. వీటి విలువ రూ. 21.72 కోట్లు (ఒక క్విoటాలు ధర రూ. 6400/-).
మొక్కజొన్నకొనుగోలు వివరాలు:- 2022-23 యాసంగి సీజనులో జిల్లాలో 10 కొనుగోలు కేంద్రాల ద్వారా 53,623 క్విoటాళ్లను 988 మంది రైతుల నుండి కొనుగోలు చేయడమైనది. వీటి విలువ రూ. 10.52 కోట్లు (ఒక క్విoటాలు ధర రూ. 1,962/-).
7. పల్లె ప్రగతి:
తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు కాబడినప్పటి నుండి గ్రామ పంచాయతీలలో పల్లె ప్రగతి కార్యక్రమములో భాగముగా చేపట్టిన అభివృద్ధి పనులు అనగా తెలంగాణకు హరిత హారం, వైకుంఠదామల నిర్మాణము, కంపోస్ట్ షెడ్ నిర్మాణము, నర్సరిల ఏర్పాటు, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు, తడి పొడి చెత్త నిర్వహణ, సేంద్రియ ఎరువుల తయారీ, ట్రాక్టర్, ట్రాలీ మరియు ట్యాంకర్ కొనుగోలు వంటి వివిధ అభివృద్ధి పనులు చేయడం జరిగింది.
అన్ని గ్రామ పంచాయతీల యందు పారిశుద్ధ్య నిర్వహణలో, తడి మరియు పొడి చెత్తను వేరు చేయడానికి గాను డంపింగ్ యార్డులకు తరలించి సేంద్రియ ఎరువుగా ఉత్పత్తి చేసి, దానిని హరిత హారం లోని నాటిన మొక్కలకు వినియోగించబడుచున్నది. 100% వైకుంఠ ధామాల నిర్మాణము పూర్తి చేయబడి వినియోగములోనికి తీసుకురావడం జరిగింది.
తెలంగాణ ఈ – పంచాయతీ వెబ్ సైట్ ఆన్ లైన్ ద్వారా (3132) భవన నిర్మాణమునకు అనుమతులను, (2569)వ్యాపార లైసెన్సు లను మరియు (31) లే – అవుట్లను గ్రామ పంచాయతీ ద్వారా అనుమతులను మంజూరు చేయడం జరిగినది. జిల్లాలకు 2022 – 2023 సం.నకు 15 వ ఆర్ధిక సంఘం నిధుల క్రింద రూ.29.44 కోట్లు మరియు యస్.ఎఫ్.సి నిధుల క్రింద రూ. 53.02 కోట్లు గ్రామ పంచాయతీలకు విడుదల చేయబడి అభివృద్ది కార్యక్రమములకై వ్యయము చేయబడుచున్నవి. జిల్లా యందు 2022 – 2023 సం.నకు పన్నులు మరియు ఇతర పన్నుల రూపాన మొత్తము రూ.25.58 కోట్లకు గాను రూ.25.16 కోట్లు అనగా మొత్తము 98.35% వసూళ్లు చేయబడినవి.
8. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ:
ఆసరా ఫించనులు:- జిల్లాలోని 2,58,245 మంది వివిధ రకాల ఆసరా పింఛనుదారులకు నెలవారి పింఛను రూ. 2016 లను చెల్లించడము జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు 19,461 మంది వికలాంగులకు నెల వారి పించన్ ను జూలై, 2023 మాసము నుండి రూపాయలు 4,016 లుగా పెంచి ఇవ్వడము జరుగుతుంది. జిల్లాలో పెన్షన్ ల రూపేణ ప్రతి నెల 2,77,706 మందికి 57 కోట్ల 93 లక్షల రూపాయలు పంపిణీ చేయబడుతుంది.
జిల్లాలో మొత్తం స్వయం సహాయక సంఘాలు 23,779 మొత్తం సంఘ సభ్యులు 2,50,982 ఉన్నారు. బ్యాంకు లింకేజీ ద్వారా జిల్లాలకు 2023-2024 సంవత్సరములో 4,803 సంఘాలకు 292.61 కోట్ల రూపాయలు సబ్సిడీ క్రింద ఋణాలు అందించడం జరిగింది. వడ్డీ రాయితీ (VLR) క్రింద జిల్లాలో 2023-24 సంవత్సరంలో మొత్తం 20,582 సంఘాలకు రూ. 71.96 కోట్లు విడుదల చేయడం జరిగింది. స్త్రీ నిధి ద్వారా జిల్లాలో 2023-2024 వ ఆర్థిక సంవత్సరమునకు 25.00 కోట్లు రూపాయలు సబ్సిడీ క్రింద రుణాల పంపిణీ చేయడం జరిగింది.
9. పట్టణ ప్రగతి:
i నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్: పట్టణ ప్రగతి ద్వారా 51.55 కోట్ల రూపాయలు, సి యం అస్సురేన్సు నిధుల ద్వారా 300 కోట్ల రూపాయలు TUFIDC నిధుల ద్వారా అండర్ గ్రౌండ్ డ్రైనెజ్ పనుల కొరకు 160 కోట్లు మరియు ఇతర అభివృద్ధి పనులకు 149.65 కోట్ల రూపాయలు, SDF -2022-23 ద్వారా 100 కోట్ల నిధులు, 15th FC ద్వారా 36.77 కోట్ల మరియు GO. 65 ద్వారా 6.5 కోట్ల రూపాయలతో నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది.
దుబ్బా, వర్ని రోడ్డు మరియు అర్సపల్లి నందు 15.63 కోట్ల రూపాయలతో నిర్మించబడిన (3) వైకుంఠ దామములను, 10.20 కోట్ల రూపాయలతో నిర్మించబడిన నూతన మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయము, 22.00 కోట్ల రూపాయలతో రఘునాథ్ టాంక్ బండ్ ఆధునీకరణ మొత్తం 47.83 కోట్ల రూపాయల పనులు ప్రారంభించడం జరిగింది.
ii బోధన్ మునిసిపాలిటి: పట్టణ ప్రగతి ద్వారా 24.09 కోట్ల రూపాయలు, సి యం అస్సురేన్సు నిధుల ద్వారా 13.55 కోట్ల రూపాయలు TUFIDC నిధుల ద్వారా 50 కోట్ల రూపాయలు 15 FC ద్వారా 36.77 కోట్ల మరియు GO. 65 ద్వారా 9.20 కోట్ల రూపాయలు మొత్తం 133.61 కోట్ల రూపాయలతో నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది.
iii ఆర్మూర్ మున్సిపాలిటీ: పట్టణ ప్రగతి ద్వారా 20.25 కోట్ల రూపాయలు, స్పెషల్ గ్రాంట్ ద్వారా 8.20 కోట్ల రూపాయలు TUFIDC నిధుల ద్వారా 100 కోట్ల రూపాయలు మరియు SCSP/TSP క్రింద 1.36 కోట్ల మొత్తం 129.81 కోట్ల రూపాయలతో నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది.
iv భీంగల్ మున్సిపాలిటీ: పట్టణ ప్రగతి ద్వారా 4.96 కోట్ల రూపాయలు, TUFIDC నిధుల ద్వారా 25 కోట్ల రూపాయలు GO. 65 ద్వారా 3 కోట్ల రూపాయ మరియు మొత్తం 32.96 కోట్ల రూపాయలతో నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది.
10. నిజామాబాదు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ:
సారంగాపూర్ ఫారెస్ట్ బీట్, ఎడపల్లి సెక్షన్ లో ఏర్పాటు చేయబడ్డ సారంగాపూర్ అర్బన్ పార్క్ లో రూ. 13.80 లక్షలతో ఎడ్యుకేషనల్ ఎన్విరాన్మెంటల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. మరియు రూ. 87 లక్షలతో కాలూర్ ట్యాంక్ బండ్ అభివృధి చేయడం, రూ. 40 లక్షలతో గంగాస్తాన్ ఫేజ్ – ll లో నుడా పార్క్ ను అభివృద్ధి చేయుట, రూ. 294 లక్షలతో చిన్నాపూర్ లోని అరణ్య అర్బన్ పార్క్ అభివృద్ధి చేయడం జరిగినది. వివిధ అభివృధి కార్యక్రమాలు రూ. 454.20 లక్షలతొ చేపట్టడం జరిగినది.
11. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా):
జిల్లాలో 9,057 స్వయం సహాయక సంఘాలు కలవు వాటిలో 90,570 సభ్యులు కలరు. బ్యాంకు లింకేజి ద్వారా 2023-24 సంవత్సరమునకు 420 స్వయం సహాయక సంఘాలకు రూ. 3409.50 లక్షల రూపాయలు వడ్డీ లేని ఋణములు ఇప్పించటం జరిగినది. పి.యం. స్వానిది క్రింద వీధి విక్రయదారులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున 24,338 వీధి విక్రయదారులకు మొదటి విడత ఋణములు ఇప్పించడం జరిగింది.మరియు రెండవ విడత ఋణాలు 10,610, మూడవ విడత ఋణాలు 722 వీధి విక్రయదారులకు వివిధ బ్యాంకుల ద్వారా ఇప్పించడం జరిగింది.
12. TSIIC:
నిజామాబాద్ పట్టణములో బైపాస్ రోడ్డు లో 40.75 కోట్ల రూపాయలతో నిర్మించబడిన IT HUB ప్రారంభించడం జరిగినది. ఇప్పటివరకు 15 software కంపెనీలు 313 ఉద్యోగస్టులతో కార్యకలాపాలు ఏర్పాటు చేసుకున్నవి. ప్రభుత్వ సంస్థలైన IIIT బాసర మరియు TASK ల ద్వారా శిక్షణ, ఉపాది మరియు సాంకేతిక మద్దతు కల్పించుబడును.
13. విద్యుత్ శాఖ:
జిల్లా లోని అన్ని క్యాటగిరి ల వినియోగదారులకు 24 గంటల విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది. పాడైన విద్యుత్ నియంత్రికల స్థానంలో పట్టణాలలో 24 గంటలలో మరియు గ్రామాలలో 48 గంటలలో బాగు చేసిన విద్యుత్ నియంత్రికలతో మార్చడం జరుగుతుంది. జిల్లాలో మొత్తం 44,895 ట్రాన్స్ఫార్మర్స్ కలవు. నాయిబ్రాహ్మణ మరియు రజక వృత్తుల వారికి ఉచిత విద్యుత్తు పధకం క్రింద 2,979 మంది లబ్దిదారులకు 250 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్తును అందించడం జరుగుతుంది. టిఎస్-ఐపాస్ పథకం క్రింద ఏప్రిల్ 23 నుండి జూలై 23 వరకు క్రొత్తగా 554 ఇండస్ట్రీస్ కు విద్యుత్ సరఫరా ఇవ్వడం జరిగుతుంది. సి.యం. గిరివికాస్ పథకం క్రింద 64 మంది లబ్దిదారులకు వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్తు సౌకర్యo కల్పించడo జరిగినది.
14. గృహ నిర్మాణ శాఖ:
జిల్లాకు (15,295) డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేసింది వీటికి పరిపాలన అనుమతులు మంజూరు చేసి (12,733) ఇళ్లకు టెండర్ ప్రక్రియ పూర్తి చేయడము జరిగినది. ఇప్పటి వరకు (9,135) గాను (6,131) లకు పనులు పూర్తి అయినవి. దీనికి మొత్తము రూ.331.00 కోట్లు మంజూరు చేయడమైనది.
గృహ లక్ష్మి పథకము క్రింద జిల్లాలో మొత్తము (16,500) ఇళ్ల మంజూరీ చేయబడినది. రూ.3 లక్షల పూర్తి సబ్సిడితో స్వంత స్థలములు కల్గిన అర్హులైన లబ్దిదారులకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గములో (3,000) చొప్పున మంజూరీ చేయబడి దరఖాస్తులను ఆహ్వానించడము జరిగినది.
15. మిషన్ భగీరథ:
గౌరవ ముఖ్య మంత్రి వర్యుల మానస పుత్రిక మిషన్ భగీరథ పథకం ద్వారా జిల్లాలో గల 805 ఆవాసాలకు, 2 నీటి శుద్ధి కేంద్రాలు నిర్మాణం చేపట్టి మరియు 3 పాత నీటి శుద్ధి కేంద్రాలు ఆధునీకరించి అనుసంధానం చేయటం జరిగింది. తద్వారా మంచి నీటి సరఫరాను తలసరి 40 లీటర్ల నుండి తలసరి 100 లీటర్లకు మెరుగుపరుస్తూ 582 అదనపు కొత్త నీటి ట్యాంకులను నిర్మించి మరియు 5,488 కి.మీ. పైపులైను వేసి 2,85,529 కుళాయిలకు ఇంటింటికీ నీరు సరఫరా చేయడం జరుగుతున్నది. ఇందుకు గాను 1,880.60 కోట్ల రూపాయలు వ్యయం చేయడం జరిగింది.
16. విద్యా శాఖ:
జిల్లాలో 1180 పాఠశాలల్లో 1,19,466 విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం అందించబడుతుంది. 2023-24 విద్యా సంవత్సరంనకు జిల్లాలోని పాఠశాలలకు 8,00,830 Nationalized Text Books లను పాఠశాలకు పంపిణీ చేయడం జరిగినది. మానవతాసధన్ ను 100 (బాలురు / బాలికలు) సరిపడు వసతి డిచ్ పల్లి తహసీల్ కార్యాలయ పరిధిలో ఫిబ్రవరి 2016 న ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం 32 మంది బాలురు 52 మంది బాలికలు మొత్తం 84 మంది ఆశ్రయం పొందుతున్నారు.
కస్తూర్భా గాందీ బాలికల విద్యాలయాలు (KGBVs): 25 KGBV లలో 5,140 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. నవీపేట్, మోర్తాడ్ KGBV లలో ఇంటర్మీడియట్ విద్యను 2023-24 విద్యా సంవత్సరం నుండి ప్రవేశపెట్టడం జరిగింది.
మన ఊరు మన బడి మన బస్తీ మన బడి జిల్లాలో 407 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం 2022 జనవరిలో “మనఊరు – మన బడి / మన బస్తీ – మన బడి” అనే ప్రధాన కార్యక్రమాన్ని 150.10 కోట్లతో ప్రారంభించింది. జిల్లాలోని 407 పాఠశాలలను ఎంపిక చేశారు. అందులో 341 పాఠశాలలు గ్రామీణ ప్రాంతాలకు చెందినవి కాగా 66 పాఠశాలలు పట్టణ ప్రాంతాలకు చెందినవి. ఇప్పటి వరకు 318 పాఠశాలలకు 31.21 కోట్ల రూపాయలు వ్యయం చేయడం జరిగింది.
17. వైద్య మరియు ఆరోగ్య శాఖ:
కె.సి.ఆర్.కిట్ పథకం క్రింద ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవమైన గర్భిణీ స్త్రీలు 64,378 మందికి 68 కోట్ల 21 లక్షల 68 వేల రూపాయలును గర్భిణీల బ్యాంకు ఖాతాలో జమచేయడం జరిగింది. జిల్లాలోని 5 బస్తి దవాఖానలు ప్రారంబించబడినవి మరియు గ్రామాల్లో 141 పల్లె దవాఖానలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పల్లె దవాఖానాలో MLHP’s నియామకం చేయడం జరిగింది. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల ప్రసవాలు 35% ఉన్న వాటిని ప్రస్తుతం ప్రసవాలు 74% గా పెంచడం తో పాటు 75% పైగా పెంచడానికి కృషి చేయడం జరుగుచున్నది. వ్యాధి నిరోధక టీకాలు పూర్తి స్థాయిలో 3092 మందికి అందించి 92% శాతం గా ఉంది. జిల్లాలో కంటి వెలుగు పథకం ద్వారా కంటి పరీక్షలు చేసి 1,66,557 మందికి అద్దాల పంపిణీ మరియు 1,987 మందికి శాస్త్ర చికిత్స చేయయడం జరిగినది. ఆరోగ్య మహిళా పథకం క్రింద 12,776 మందికి 8 రకాల ప్రత్యేక పరీక్షలు చేయడం జరిగినది. తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ ద్వారా 134 రకాల పరీక్షలు 4,58,564 మందికి ఉచితంగా చేయడం జరిగినది. 5,108 కె.సి.ఆర్ న్యూట్రిషన్ కిట్ కు గాను ఇప్పటివరకు 3,594 న్యూట్రిషన్ కిట్లను గర్భిణీ స్త్రీలకు అందించడం జరిగినది.
ఈ-సంజీవని, జాతీయ ఆరోగ్య మిషన్, ఆసరా పెన్షన్, అసాంక్రమిక వ్యాధులు (యన్.సి.డి), పాలియేటివ్ కేర్ సేవలు, జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రన కార్యక్రమం, NLEP జాతీయ కుష్ఠు నిర్ములన కార్యక్రమం, RBSK కార్యక్రమం, TSACS, ఆరోగ్య శ్రీ సేవలు, OP సేవలు, జాతీయ మానసిక వ్యాధుల నివారణ కార్యక్రమం (NMHP), ప్రాథమిక ఆరోగ్య కేంద్రoలు (PHC), ఆరోగ్య ఉప కేంద్రoలు, అంబులెన్స్ సేవలు (102), అంబులెన్స్ సేవలు (108) మొదలగు పథకాల ద్వారా ప్రజలకు సేవలు అందించబడుచున్నవి.
18. మహిళా, శిశు, వికలాంగుల మరియు వయో వృద్ధుల శాఖ:
జిల్లాలో 5 సమగ్ర శిశు అభివృద్ధి సేవ ప్రాజెక్టులలో 1365 మేయిన్ మరియు 135 మని అంగన్వాడి కేంద్రములు కలవు. అందులో 85,193 మంది పిల్లలకు, 12,130 గర్భిణీలు మరియు 10,676 బాలింతలకు అనుబంధ పోషాకాహారము, 29828 మంది 3-6 సంవత్సరము పిల్లలకు ఆట పాటల ద్వారా పూర్వప్రాథమిక విద్య అందించబడుచున్నది. జిల్లాలో ఆరోగ్యలక్ష్మి పథకం, పోషణ అభియాన్ పథకము ద్వారా వ్యాధి నిరోధక టీకాలు, ఆరోగ్య పరీక్షలు, సలహాలు సంప్రదింపులు, పోషణ మరియు ఆరోగ్య, విద్య మొదలగు సేవలు అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించబడుచున్నవి. జిల్లాలో 43 మంది బాలికలతో ఒక బాలసదనము నడుపబడుచున్నది.
జిల్లాలో శిశు గృహ ద్వారా 0-5 సంవత్సరాల లోపు గల వదిలి వేసిన పిల్లలకు రక్షణ కల్పిస్తూ వారికి ఆహార, వైద్య మొదలగు సదుపాయాలు కల్పించబడుచున్నవి. ప్రస్తుతం శిశు గృహాలో 13 మంది పిల్లలు ఉన్నారు.
19. షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ:
2022-2023 సంవత్సరములో జిల్లాలోని (32) సాంఘీక సంక్షేమ శాఖ వసతి గృహములలో (2762) మంది విద్యార్థిని విద్యార్థులకు వసతి గృహములలో ప్రవేశము కల్పించనైనది. 2023-24 సంవత్సరములో బెస్టు అవలబుల్ స్కూల్స్ స్కీమ్ క్రింద (06) పాఠశాలలో చదువుచున్న (203) మంది యస్.సి. విద్యార్థిని, విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వడము జరిగినది. 2023-24 సంవత్సరములో కులాంతర వివాహములు చేసుకున్నా (03) జంటలకు రూ. 7.50 లక్షలు ఆర్థిక ప్రోత్సాహకము మంజూరు చేయడము జరిగినది. 2023-24 సంవత్సరములో 12,655 కుటుంబాలకు ఉచిత విద్యుత్ సరఫరా క్రింద రూ. లు 58.58 లక్షలు ఖర్చు చేయడము జరిగినది.
20. జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ది సంస్థ:
దళిత బంధు పథకములో మొదటి విడత క్రింద ట్రాన్స్ పోర్టు సెక్టర్ మరియు నాన్ ట్రాన్స్ పోర్టు సెక్టర్ క్రింద 550 యూనిట్లకు గాను రూ.55.00 కోట్ల వ్యయంతో యూనిట్లు నెలకొల్పడం జరిగినది. రెండవ విడతలో మన జిల్లాకు 6,050 యూనిట్లు మంజూరు చేయబడినవి. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుచున్నది.
21. జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ:
జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో (10) విద్యా సంస్థలు మరియు వసతి గృహాలు నిర్వహించబడుచున్నవి. 1159 విద్యార్థులకు విద్య మరియు వసతి కల్పించడము జరిగినది.
అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం 8,766 గిరిజనులు 10,199.10 ఎకరాల విస్తీర్ణమునకు సంబందించిన హక్కు పత్రాల కొరకు దరఖాస్తు చేయగా అందులో అర్హత గల 4,229 మంది గిరిజన రైతులకు 8,611.14 ఎకరాలకు సంబందించిన అటవీ భూమి హక్కు పత్రాలను పంపణి చేయడం జరిగినది.
ప్రధాన మంత్రి అది ఆదర్శ్ గ్రామ యోజన పథకము (PMAAGY) క్రింద ప్రభుత్వము 10 గ్రామ పంచాయతీలు/గ్రామాలను (50% శాతము మించి/500 గిరిజన జనాభా) కలిగిన వారి నుండి ఎంపిక చేసి రూ.2.00 కోట్లతో వివిధ పథకాల క్రింద అనగా, విద్యా, ఆరోగ్యము, మురికి కాలువల నిర్మాణము కొరకు నిధులు మంజూరు చేసి పనులు పురోగతిలో కలవు. దీని వలన 21,308 గిరిజన కుటుంబాలకు మౌలిక సౌకర్యములు కల్పించబడినది.
22. వెనుకబడిన తరగతుల అభివృద్ది శాఖ:
వెనుకబడిన తరగతుల కుల వృత్తుల వారికి మరియు అత్యంత వెనుకబడిన తరగతుల వారికి రూ.1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం కొరకు 23,892 లబ్దిదారులు ధరఖాస్తులు చేసుకొవడం జరిగింది. ప్రతి నెల ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో 300 మంది అర్హులైన లబ్దిదారులకు పంపిణి చేయడం జరుగుతుంది. జిల్లాలో 19 ప్రీమెట్రిక్ మరియు 15 పోస్ట్ మెట్రిక్ వసతి గృహములు అనగా మొత్తము 34 వసతి గృహములు నడుపబడుచున్నవి.
23. అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ:
జిల్లాలో మొత్తం 19 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు కళాశాలలు నడుచుచున్నవి. ప్రతి విద్యార్థికి సంవత్సరమునకు రూ.1.20 లక్షల చొప్పున ప్రభుత్వము ఖర్చు పెడుతున్నది.
తెలంగాణ ప్రభుత్వం, 2023-24 సంవత్సరమునకు గాను నిరుద్యోగ మైనారిటీ అభ్యర్దులకు (ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు మరియు జైనులు) లకు 100% సబ్సిడీ తో రూ.1.00 లక్ష మంజూరు చేయుటకు నిర్ణయిoచడమైనది. ముస్లిం మైనారిటీ అభ్యర్దులకు ఒక్కొక్కరికి రూ.1.00 లక్ష చొప్పున మొత్తం 648 మంది అభ్యర్దులకు గాను 6 కోట్ల 48 లక్షలు మంజూరు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పథకములో 2వ విడుతగా, ప్రతి నియోజక వర్గమునకు 120 మంది లబ్దిదారుల చొప్పున మొత్తం 660 మంది లబ్దిదారులను ఎంపిక చేసి ప్రతి ఒక్కరికి రూ. 1.00 లక్ష చొప్పున మొత్తం రూ.6.60 కోట్లు సబ్సిడీ మంజూరు చేయబడును. అదేవిదంగా నిరుద్యోగ క్రిస్టియన్ అభ్యర్దులకు 2023-24 సంవత్సరములో 100% సబ్సిడీ తో రూ.1.00 లక్ష మంజూరు చేయుట కొరకు ఆన్లైన్ ద్వారా ధరఖాస్తులు కోరడమైనది. ధరఖాస్తులు నమోదు చివరి తేదీ:14.08.2023 గా నిర్ణయిoచడమైనది. ఎంపిక ప్రక్రియ పూర్తయిన తరువాత రూ: 1.00 లక్ష మంజూరు చేయబడును.
24. రహదారులు మరియు భవనముల శాఖ:
భవనములు: క్రింద కలెక్టర్ మరియు అధికారుల నివాస గృహములు రూ. 13.22 కోట్లతో మంజూరు చేయబడినవి, పని జరుగుచున్నది. బైపాస్ రోడ్డు లో 8.55 కోట్ల రూపాయలతో నిర్మించబడిన న్యాక్ భవనము ప్రారంభించబడినది. ఇందూర్ కళాభారతి భవనము రూ. 50 కోట్లతో మంజూరు చేయబడి పని పురోగతిలో కలదు.
ఎమ్మెల్యే క్వార్టర్స్ : రూ.5.90 కోట్లతో 5 ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కమ్ రెసిడెన్స్ మంజూరు చేయబడినవి. 4 ఎమ్మెల్యే క్వార్టర్స్ 4.17 కోట్ల వ్యయంతో పనులు పూర్తయ్యాయి. 1 ఎమ్మెల్యే క్వార్టర్, బాల్కొండ పని పూర్తి కావడానికి చివరి దశలో ఉంది.
రైల్వే డిపాజిట్ వర్క్స్: క్రింద పాత ఎన్ హెచ్ 7 రహదారి నుండి 311/6 నుండి 312/4 వరకు రైల్వే బ్రిడ్జ్ నంబర్ 773 (బ్యాలెన్స్ వర్క్) వరకు రూ.32 కోట్లు మంజూరు చేయబడింది. పని పురోగతిలో కలదు. ఇప్పటివరకు అయిన వ్యయము రూ. 12.75 కోట్లు.
ROB మాధవనగర్ ఎల్సి నెం.193 పని రూ. 93.12 కోట్లకు మంజూరు చేయబడింది. పని పురోగతిలో కలదు. ఇప్పటివరకు అయిన వ్యయము రూ. 15.67 కోట్లు.
ROB ఎల్.సి. నం 191 పనికి రూ.137.50 కోట్లు మంజూరు చేయబడినవి, ఈ పని అగ్రిమెంట్ దశలో ఉన్నది.
పిరియాడికల్ రేనేవల్స్ (PR) 2022-2023: క్రింద రూ 87.79 కోట్లతో (37) పనులు, 191.07 కి.మీ. అభివృద్ధి చేయుటకు మంజూరు కాగ, (22) పనులు పూర్తి అయినవి, (14) పనులు అభివృద్ధిదశలో ఉన్నవి, (1) పని టెండరు దశలో ఉన్నది, 114.30 కి.మీ పొడవు రూ. 8.73 కోట్ల వ్యయంతో పూర్తయింది.
ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ (FDR) 2022-23: క్రింద రూ 54.55 కోట్లతో (38) పనులు మంజూరు కాగ, (2) పనులు పూర్తి అయినవి, (9) పనులు అభివృద్ధిదశలో ఉన్నవి, (10) పనులు అగ్రిమెంట్ దశలోఉన్నవి. (17) పనులు టెండర్ దశలో ఉన్నవి, మొత్తం వ్యయము రూ. 65.53 లక్షలు.
ప్రణాళికేతర పునరుద్దరణ పనులు 2022-23: క్రింద రూ 25.41 కోట్లతో (9) రహదారి పనులు, (1) బ్రిడ్జి పని మంజూరు కాగ, (3) రహదారి పనులు, (1) బ్రిడ్జి పని పూర్తి అయినవి, (6) రహదారి పనులు అభివృద్ధిదశలో ఉన్నవి, పొడవు మంజూరైంది 53.49 కి.మీ, 17.74 కి.మీ పొడవు రూ. 5.95 కోట్లు వ్యయంతో పూర్తయింది.
ప్రణాళిక పనులు 2022-23: క్రింద రూ.126.58 కోట్లతో (13) రహదారి పనులు, (1) బ్రిడ్జి పని మంజూరు కాగ, (7) రహదారి పనులు, (1) బ్రిడ్జి పని అభివృద్ధి దశలో ఉన్నవి, (3) పనులు అగ్రిమెంట్ దశలో ఉన్నవి. (3) పనులు టెండరు దశలో ఉన్నవి.
ఎస్.టి .ఎస్.డి.ఎఫ్ (అనుసందానము లేని ఎస్.టి ప్రవాసాలు): రూ.74.06 కోట్లతో (44) పనులు మంజూరు కాగ, (8) పనులు అభివృద్ధిదశలో ఉన్నవి, (8) పనులు అగ్రిమెంట్ దశలో ఉన్నవి, (28) పనులు టెండరు దశలో ఉన్నవి.
ప్రణాళిక పనులు 2023-24: రూ 45.50 కోట్లతో (4) బ్రిడ్జి పనులు, (1) రహదారి పని మంజూరు కాగ, అన్ని పనులు టెండర్ దశలో ఉన్నవి.
ఎస్.సి’ఎస్.డి.ఎఫ్ & ఎస్.టి .ఎస్.డి.ఎఫ్ 2022-23: రూ.183.40 కోట్లతో (52) రహదారి పనులు, (1) బ్రిడ్జి పని, 119.64 కి.మీ అభివృద్ధి చేయుటకు మంజూరు కాగ, (7) రహదారి పనులు, (1) బ్రిడ్జి పని అభివృద్ధిదశలో ఉన్నవి, (4) పనులు అగ్రిమెంట్ దశలో ఉన్నవి, (41) పనులు టెండరు దశలో ఉన్నవి. 7.92 కి.మీ పొడవు రూ. 5.97 కోట్ల వ్యయంతో పూర్తయింది.
CRF 2021-2022 & 2023-24: క్రింద రూ.82 కోట్ల మొత్తానికి 4 పనులు, 42.44 కి.మీ. అభివృద్ధి చేయుటకు మంజూరయ్యాయి, (3) పనులు అభివృద్ధి దశలో ఉన్నవి, 1 పని టెండరు దశలో ఉన్నది. 12.22 కి.మీ పొడవు రూ.21.28 కోట్ల వ్యయంతో పూర్తయింది.
ఎస్ డి ఎఫ్ 2021-2022 & 2023-2024: ఈ పద్దు లో రూ.8 కోట్లతో (7) పనులు మంజూరు కాగ, 4 పనులు పూర్తి అయినవి, 2 పనులు అభివృద్ధి దశలో ఉన్నవి, ఒక పని టెండరు దశలో ఉన్నది.
25. జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ:
జిల్లాలో పి.యం.జి.యస్.వై., సి.ఆర్.ఆర్., యం.ఆర్.ఆర్., ఎస్.డి.ఎఫ్., టి.యస్.పి., యం.జి.ఎన్.ఆర్.జి.ఎస్., యం.ఆర్.ఆర్-బి.టి.ఆర్., ఎఫ్.డి.ఆర్. మరియు ఎన్.ఎం.సి. (TUFIDC) పథకాల క్రింద 9,741 అభివృద్ధి పనులను 1232.76 కోట్ల రూపాయలతో మంజూరు చేయగా, 6,707 పనులకు 625.17 కోట్ల రూపాయలు ఖర్చుతో పనులు పూర్తి చేయడం జరిగింది. మిగిలిన 1,199 పురోగతిలో కలవు. ప్రైమరి హెల్త్ సెంటర్, హెల్త్ సబ్ సెంటర్ మరియు ఫై.యం.ఎ.ఎ.జి.వై. పథకాల క్రింద 155 పనులు 22.43 కోట్ల రూపాయలతో మంజూరు చేసి 54 పనులు 2.48 కోట్ల రూపాయలతో పూర్తి చేయడం జరిగింది. మిగిలిన పనులు పురోగతిలో గలవు.
26. నీటి పారుదల శాఖ
జిల్లాలో 2014 నుండి 2022 వరకు భారీ, మద్య తరహా, చిన్న నీటి పారుదల, చెక్ డ్యాంలు, చిన్న నీటి ఎత్తిపోతల పథకాలు మరియు పుష్కర ఘాట్ ల పనుల కోసం రూ.5217.39 కోట్లు కేటాయించగా, ఇప్పటి వరకు రూ.3919.21 కోట్లు ఖర్చు చేయడం జరిగింది.
I.మిషన్ కాకతీయ పనులు (చిన్ననీటివనరుల పునరుద్ధరణ): 2015 సంవత్సరము నుండి 837 చెరువులకు రూ.329.22 కోట్లతో పునరుద్ధరణ పనులు చేపట్టడం జరిగింది. ఈ పనుల కింద అయిన ఖర్చు 235.37 కోట్లు
II. మినీ ట్యాంక్ బండ్ లు : బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్ మరియు రూరల్ నియోజకవర్గంలో మినీ ట్యాంక్ బండ్ లను అభివృద్ది చేయడానికి రూ.40.82 కోట్లు కేటాయించగా, ఇప్పటి వరకు రూ. 31.67 కోట్ల వ్యయం చేయడం జరిగింది.
III. RRR పనులు: జిల్లాలో 58 పనులకు రూ. 27.93 కోట్లతో 2018 లో పునరుద్ధరణ పనులు చేపట్టడం జరిగింది. ఈ పనుల కింద అయిన ఖర్చు 16.96 కోట్లు
IV. చెక్ డ్యాంల నిర్మాణము: 2014 నుండి జిల్లాలో 47 చెక్ డ్యామ్ ల నిర్మాణం రూ.269.29 కోట్లతో చేపట్టడం జరిగింది. ఈ పనుల కింద అయిన ఖర్చు రూ.170.14 కోట్లు
V. సిద్దాపూర్ రిజర్వాయర్: రూ.72.52 కోట్లతో వర్ని మండలం లోని చెరువుల అభివృద్ధి మరియు సామర్థ్య పెంపుదలకు పనులు జరుగుతున్నాయి. వర్ని మండలం లోని చద్మల్, పైడిమల్ & నామ్‌కల్ రిజర్వాయర్ నుండి గ్రావిటీ కాలువల తవ్వకానికి రూ. 46.89 కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఈ పనుల కింద ఇప్పటివరకు అయిన ఖర్చు రూ.2.02 కోట్లు
VI. నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఉప కాలువల ఆధునీకరణ: జిల్లా కు సంబంధించి నిజాంసాగర్ ఉప కాలువల ఆధునికరణ పనుల కోసం రూ.149.65 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ పనులపై రూ.106.11 కోట్లు ఖర్చు చేయబడినది.
VII. శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్ కింద నిజామాబాద్ జిల్లా లో జరిగిన పనుల వివరాలు : శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్ కింద నిజామాబాద్ జిల్లా లో 2014 నుండి 2022 మద్య కాలంలో ముంపు గ్రామాలకు సీసీ రోడ్లు, కట్టపైన గోడ, BT రోడ్ మరియు డ్యామ్ గేట్ల మరమ్మత్తుల పనులను రూ.62.66 కోట్ల వ్యయంతో చేపట్టడం జరిగింది. ఈ పనుల కింద ఇప్పటివరకు అయిన ఖర్చు రూ.59 కోట్లు
VIII. లక్ష్మి కెనాల్ ఆధునీకరణ: లక్ష్మి కెనాల్ D2, D3, D4, D3-R2 & D3-L1 ఆధునీకరణ పనులకై తెలంగాణా ప్రభుత్వము 2017 లో రూ.20.44 కోట్లకు పరిపాలన ఆమోదము తెలిపింది. ఇట్టీ పనులపై రూ. 9.13 కోట్లు ఖర్చు చేయడం జరిగినది.
IX. రామడుగు ప్రాజెక్ట్ : రామడుగు ఎడమ తూము మరమ్మత్తులకు రూ.0.85 కోట్లకు ప్రభుత్వము పరిపాలన ఆమోదము తెలిపింది. ఇట్టీ పనుల పై రూ.0.75 కోట్లు ఖర్చు చేయడం జరిగినది.
X. గట్టుపోడిచిన వాగు: గట్టుపోడిచిన వాగు కెనాల్ త్రవ్వకానికి రూ.22.26 కోట్లకు ప్రభుత్వము పరిపాలన ఆమోదము తెలిపింది. ఇట్టీ పనులపై రూ.14.99 కోట్లు ఖర్చు చేయడం జరిగినది.
XI. కాళేశ్వరం ప్యాకేజ్ పనులపై నివేదిక: కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్-VII యొక్క ముఖ్య ఉద్దేశ్యము శ్రీ రామ్ సాగర్ జలాశయం నుండి 73 Cumecs (2578 Cusecs) నీటిని ఎత్తిపోసి 1 Cumecs (35 Cusecs) నీటిని నిజామాబాద్ కి త్రాగునీరు అందించడంతో పాటు 72 Cumecs (2543 Cusecs) లతో నిజామాబాద్ జిల్లాలో 1.81 లక్షల ఎకరాలకు నీటి పారుదల అందించడం.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజ్ 20, 21, 21A వివరాలు:
ప్యాకేజ్ 20: 2008 సంవత్సరములో రూ.897 కోట్లతో ప్యాకేజ్ 20 పనులను చేపట్టడము జరిగింది. సర్జ్పూల్ మరియు పంప్ హౌస్ సారంగాపూర్ (3 పంపులు ఒక్కొక్కటి 30MW) పంపుల బిగింపు పని పూర్తి అయినది. పంపుల టెస్ట్ రన్ పూర్తి అయినది. ఈ ప్యాకేజ్ కింద అయిన ఖర్చు రూ.832 కోట్లు. ఇందులో 2014 తర్వాత అయిన ఖర్చు రూ.569.52 కోట్లు
ప్యాకేజ్ 21: 2008 సంవత్సరములో రూ.1143 కోట్లతో ప్యాకేజ్ 21 పనులను చేపట్టడము జరిగింది. సర్జ్ ఫూల్ & పంపు హౌస్ @ మంచిప్ప (ఒక్కక్కటి 30MW, 2 పంపులు) పంపులు మరియు మోటార్లు రావాల్సి ఉన్నవి. కొండెము చెరువులో నీటిని వదలడానికి ప్రెజర్ మెయిన్స్ వేయు పని మరియు సర్జ్ ఫూల్ లైనింగ్ పని పూర్తి అయినది. ఈ ప్యాకేజ్ కింద అయిన ఖర్చు రూ. 408.30 కోట్లు. ఇందులో 2014 తర్వాత అయిన ఖర్చు రూ.271.23 కోట్లు
ప్యాకేజ్ 21A మెట్‌పల్లి సెగ్‌మెంట్: పంపు హౌస్ నిర్మాణము (10 పంపులు X 2.5 MW సామర్ద్యము, 14.400 కి. మీ., నిజాంసాగర్ కెనాల్, మెంట్రాజ్పల్లి వద్ద) దాదాపు పూర్తి అయినది మరియు నెట్‌వర్క్ పైపు లైన్ పనులు జరుగుతున్నవి. పంపుల డ్రై రన్ మరియు వెట్ రన్ లొ భాగంగా 234 Mcft నీటిని ఎత్తి పోసి కప్పల వాగు మరియు పెద్ద వాగు టాపింగ్ పాయింట్ ద్వార వాగులోని చెక్ డ్యాంల ను నింపడం జరిగింది. నెట్‌వర్క్ పైప్ లైన్ లో భాగంగా 83.69 కి. మీ. M.S, 130.86 కి. మీ. D.I. మరియు 1046.05 కి. మీ. HDPE పైప్ లైన్ వేయడం జరిగింది. ఈ ఖరీఫ్ లో 16 వేల ఎకరాలకు నీరు అందించడానికి సిద్దం చేయబడినది.
ప్యాకేజ్ 21A గడ్కోల్ సెగ్‌మెంట్: పంపు హౌస్ నిర్మాణము (8 పంపులు X 2.0 MW సామర్ద్యముతో మంచిప్ప చేరువు వద్ద) పురోగతిలో ఉంది మరియు నెట్‌వర్క్ పైపు లైన్ పనులు పురోగతిలో ఉన్నాయి. నెట్‌వర్క్ పైప్ లైన్ లో భాగంగా 53.90 కి. మీ. M.S మరియు 90.35 కి. మీ. D.I. పైప్ లైన్ వేయడం జరిగింది. ప్యాకేజ్ 21 A రివైజేడ్ పరిపాలన రూ.3653.98 కోట్లకు ప్రభుత్వము అనుమతి ఇచ్చింది. ప్యాకేజ్ 21A కింద అయిన ఖర్చు రూ.1748.95 కోట్లు.
XII. శ్రీ రామ్ సాగర్ జలాశయ పునరుజ్జీవ పథకం: శ్రీ రామ్ సాగర్ పునరుజ్జీవనలో భాగంగా ముప్కాల్ పంప్ హౌస్ పనుల కోసం రూ.610 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. పునరుజ్జీవ పథకాన్ని చేపట్టి, మూడు ఎత్తిపోతల ద్వారా వరద కాలువలో నీరు నిలిచి వరద కాల్వను నాలుగు రిజర్వాయర్లు గా మార్చడము జరిగింది. ఈ ఖరిఫ్ వానాకాల పంటలకు మరియు త్రాగునీటి అవసరాలకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం 15 రోజులలో 4 TMC ల కాళేశ్వరం జలాలను SRSP జలాశయంలో ఎత్తి పోయడం జరిగింది.
XIII. జాకోర, చందూర్ ఎత్తిపోతల పథకం: నిజాంసాగర్ కెనాల్ కుడి వైపున ఉన్న 7050 ఎకరాలకు నీరు అందించడం కోసం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రూ.106.04 కోట్లకు పనులు జరుగుతున్నాయి. ఈ పనుల కింద అయిన ఖర్చు రూ .11.74 కోట్లు
XIV. చిన్న నీటి ఎత్తిపోతల పథకాలు: ఫతేపూర్, సుబీరియాల్, మరియు చిట్టాపూర్ ఎత్తిపోతల పథకానికి రూ.149.66 కోట్లతో పనులు జరుగుతున్నాయి. 9,214 ఎకరాలకు ఈ పథకం ద్వారా నీరు అందుతుంది.
మచ్చెర్ల ఎత్తిపోతల పథకం : ప్రభుత్వము రూ.40.40 కోట్లకు G.O.No. 244 తేదీ 01.08.2023 ద్వారా పరిపాలన ఆమోదము తెలుపబడినది. 2,860 ఎకరాలకు ఈ పథకం ద్వారా నీరు అందుతుంది.
బినోల కంటo & చిక్లి ఎత్తిపోతల పథకం : ప్రభుత్వము రూ.79.89 కోట్లకు G.O.No. 243 తేదీ 01.08.2023 ద్వారా పరిపాలన ఆమోదము తెలుపబడినది. 5,155 ఎకరాలకు ఈ పథకం ద్వారా నీరు అందుతుంది. మాక్లూర్ మండలములోని నిజాంసాగర్ చివరి ఆయకట్టు 1,000 ఎకరాలకు నీటిని అందివ్వటానికి, ఎత్తిపోతల పథకానికి రూ.11.71 కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఈ పనుల కింద అయిన ఖర్చు రూ.1.90 కోట్లు.
మునిపల్లి లిఫ్ట్ స్కీమ్: గుత్పా బ్యాలెన్సింగ్ ట్యాంక్ పైన ఎత్తిపోతల పథకానికి రు.23.80 కోట్లతో పనులు జరుగుతున్నాయి. 2,642 ఎకరాలకు ఈ పథకం ద్వారా నీరు అందుతుంది. ఈ పనుల కింద అయిన ఖర్చు రూ.8.96 కోట్లు
XV. ఆపరేషన్ మరియు మేంటెనెన్స్ పనులు:
i) మేజర్ లిఫ్ట్ స్కీమ్ లు:
అలీ సాగర్, గుత్ప, చౌట్పల్లి మరియు లక్ష్మి కెనాల్ లిఫ్ట్ పథకాల యొక్క కార్యనిర్వహణ పనుల గురించి 2014 నుండి 2023 వరకు రూ.75.63 కోట్లు కేటాయించగా, ఇప్పటి వరకు రూ.33.26 కోట్లు ఖర్చు చేయడం జరిగింది.
చెరువుల మరియు కాల్వల నిర్వహణ పనులు: 2021 నుండి 192 ఆపరేషన్ మరియు మేంటెనెన్స్ పనులకు రూ. 20.04 కోట్లకు అనుమతి మంజూరు చేయబడినది. పనులు పురోగతిలో ఉన్నవి. ఈ పనుల కింద అయిన ఖర్చు రూ.6.75 కోట్లు
XVI. పుష్కర ఘాట్ లు: జిల్లాలో 10 పుష్కర ఘాట్లను రూ. 13.71 కోట్ల వ్యయంతో 2015 లో గోదావరి పుష్కరాల సంధర్భంగా నిర్మించడం జరిగింది. ఈ పనుల కింద అయిన ఖర్చు రూ.10.78 కోట్లు.
27. తెలంగాణకు హరిత హరం:
జిల్లా మొత్తం అటవీ ప్రాంతం: 2,14,056.38 ఎకరాలు ఇది జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో 20.86%. 2023-24 సంవత్సరంనకు 47.978 లక్షల మొక్కలు నాటుటకు లక్ష్యం నిశ్చయించబడింది. ఈ రోజు వరకు 33 లక్షల మొక్కలు జిల్లాలో నాటడం జరిగింది. జిల్లాలో NH-44 మరియు NH-63 రోడ్ల వెంట అవెన్యు ప్లాంటేషన్ 185 కి.మీ. లందు మొక్కలను నాటడం జరిగినది. ప్రతి గ్రామ పంచాయితీలో ఒక నర్సరీని పెంచుతూ జిల్లాలో మొత్తం 530 నర్సరీలు మరియు మునిసిపల్ కార్పొరేషన్, మూడు మునిసిపాలిటీల యందు మొత్తము 34 పట్టణ నర్సరీలు ఏర్పాటు చేయడం జరిగినది. వివిధ దశలలో 8 విడుతల వారీగా మొత్తం 1321.77 లక్షల మొక్కలు జిల్లాలో నాటడం జరిగింది.
28. కళ్యాణ లక్ష్మి / షాది ముభారాక్:
కళ్యాణ లక్ష్మి – షాదిముబారక్ పథకం క్రింద 1,00,116 రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది. మన జిల్లాలో కళ్యాణ లక్ష్మి పథకం ప్రారంభం నుండి ఇప్పటి వరకు జిల్లాలో 48,625 మంది లబ్దిదారులకు 486 కోట్ల 81 లక్షల రూపాయలు పంపిణి చేయడం జరిగింది. షాదీ ముబారక్ పథకం ప్రారంభం నుండి ఇప్పటి వరకు జిల్లాలో 21,203 మంది లబ్దిదారులకు 212 కోట్ల 27 లక్షల రూపాయలు పంపిణి చేయడం జరిగింది.
29. ధరణి:
తెలంగాణ ప్రజలకు తమ ఆస్తి లావాదేవిల ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2020లో ధరణి పోర్టల్‌ను లాంచ్ చేసింది. ఆస్తి రిజిస్ట్రేషన్ల విధానాన్ని ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆస్తి రిజిస్ట్రేషన్ మాత్రమే కాకుండా ల్యాండ్ మ్యూటేషన్, ల్యాండ్ రికార్డుల సెర్చ్, ఇతర భూ సంబంధిత సేవలకు ధరణి పోర్టల్ ఒక గమ్యస్థానంగా ఉంది. డిజిటల్‌గా ల్యాండ్ రికార్డులను తీసుకురావడంతో పారదర్శకత పెరిగింది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ ఆఫీసులలో మోసాలు తగ్గాయి. వ్యవసాయ, వ్యవసాయేతర ప్రాపర్టీలు రెండింటికీ ఈ ధరణి పోర్టల్ పని చేస్తుంది. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ల్యాండ్ రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ నిమిషాలలో జరిగిపోతున్నాయి. పాత ఓనర్ పాస్‌బుక్‌ను అప్ డేట్ చేసి, కొనుగోలుదారునికి కొత్త పాస్ బుక్ ఇస్తున్నారు. వ్యవసాయ భూములకు గ్రీన్ రంగు పాస్ బుక్‌లను జారీ చేస్తున్నారు. అంతకుముందు ల్యాండ్ రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ కోసం వారాల తరబడి సమయం పట్టేది.
జిల్లాలో అన్ని మండలాలలో నేటి వరకు 54,533 రిజిస్ట్రేషన్ లు 4,397 నాలా, 8,830 successions, 8,809 పెండింగ్ మ్యుటేషన్ లు మరియు 219 పార్టిషన్ కేసులు చేసి పాసు పుస్తకాలు జారీచేయడం జరిగింది.
అలాగే పార్ట్ – బి లో ఉన్న భూములకు సంబంధించి జిల్లాలో ఇప్పటివరకు 30,831 భూ సమస్యల గురించి దరఖాస్తులు రాగ అందులో 26,215 దరఖాస్తులను పరిష్కరించడం జరిగింది. మిగిలిన 4,616 దరఖాస్తులు పురోగతిలో కలవు.
30. ఇండ్ల స్థలాల క్రమబద్దీకరణ:
G.O.MS.No 58 ఈ జి.వో ప్రకారం 125 మరియు అంతకంటే తక్కువ గజాలలో ఇల్లు కట్టుకున్న వారు ఎలాంటి రుసుము చెల్లించకుండా వారి ఇల్లును రెగ్యులరైజ్ చేసుకోవచ్చును. ఈ జి.వో ద్వారా ఇప్పటివరకు మొత్తం 1158 ఆర్జీలు రాగా అందులో 1044 ఆర్జీలు పరిశీలించనైనది. మిగిలిన 114 ఆర్జీలు ప్రగతిలో కలవు.
G.O.MS.No 59 ఈ జి.వో ప్రకారం 125 మరియు అంతకంటే ఎక్కువ గజాలలో ఇల్లు కట్టుకున్న వారు ప్రభుత్వం నిర్ణయించిన రుసుముతో వారి ఇల్లును రెగ్యులరైజ్ చేసుకోవచ్చును. ఈ జి.వో ద్వారా ఇప్పటివరకు మొత్తం 402 ఆర్జీలు రాగా అందులో 280 ఆర్జీలు పరిశీలించనైనది. మిగిలిన 122 ఆర్జీలు ప్రగతిలో కలవు.
31. పరిశ్రమల శాఖ:
జిల్లాలో 8 భారీ మరియు మధ్య తరహ పరిశ్రమలు రూ. 332.65 కోట్ల పెట్టుబడితో స్థాపించబడినవి. వీటి ద్వారా 7,424 మందికి ఉపాధికల్పించబడినది అదే విధంగా జిల్లాలో 691 సూక్ష్మ మరియు చిన్న తరహ పరిశ్రమలు, రూ.351.42 కోట్ల పెట్టు బడితో స్థాపించబడి, 4,701 మందికి ఉపాధి కల్పించబడినది.
32. కార్మిక శాఖ:
తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డ్ క్రింద నమోదు చేసుకున్న ఇప్పటివరకు జిల్లాలో వివిధ పథకాల నుండి 3,964 మంది కార్మికులకు 15.33 కోట్ల రూపాయలు పరిహారం అందించడం జరిగింది. వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో నమోదు చేసుకున్న 5,464 కార్మికులకు జాతీయ నిర్మాణ సంస్థ ద్వారా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు 1.99 కోట్ల స్టైఫండ్ రూపంలో ఈ పథకం క్రింద ఇవ్వడమైనది.
33. శాంతి భద్రతల పరిరక్షణ:
జిల్లా వ్యాప్తంగా డయల్ 100 లో వచ్చే ఫిర్యాదుల ద్వారా స్వీకరించడం జరుగుతుంది. ఇందులో ప్రతీ ఫోన్ కాల్ ను సాద్యమైనంత త్వరిత గతిన 5 నిమిషాలలో సమస్య పరిష్కరించడం జరిగింది.
ఫిర్యాదు దారుడు పోలీస్ స్టేషన్ కు రాకుండానే టి.యస్.కాప్, ట్విట్టర్, హాక్ఐ, ఫేస్ బుక్ ద్వారా ఫిర్యాదు చేసినట్లయితే వారి ఫిర్యాదులను స్వీకరించి వారికి సత్వరన్యాయం అందేలా చేయడం ట్రాఫిక్ లో సమూలమైన మార్పులు చేపడుతు పారదర్శకత మరియు జవాబుదారి తనంగా ఉండడము కోసం కేసులు నమోదుచేస్తు కాంట్రాక్టు మరియు నాన్ కాంట్రాక్టు విధానం ఉపయోగిస్తున్నాము. శాంతి భద్రతలను సామరస్యాన్ని కాపాడినందుకు, జిల్లాలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండ చర్యలు తీసుకున్నందుకు జిల్లా పోలీస్ యంత్రాంగానికి అభినందనలు.
ప్రభుత్వం చేపట్టిన అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికి చేరడంలో సహకరించిన ప్రజాప్రతినిధులందరికి, అధికారులకు, ప్రతి ఒక్కరికి నా అభినందనలు.
ఈ కార్యక్రమమునకు విచ్చేసిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పత్రికా విలేఖరులకు, స్వాతంత్ర్య సమరయోధులకు మరియు తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
జై హింద్