మున్సిపల్ ఫలితాలపై తొలగిన ఉత్కంఠ
9న ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాలు
నిలిపివేత సరికాదు : హైకోర్టు
ఏర్పాట్లు చేసుకుంటాం : రమాకాంత్
హైదరాబాద్, ఏప్రిల్ 1 (జనంసాక్షి) :మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ తొలగింది. ఈనెల 9న ఓట్లు లెక్కించి అదే రోజు ఫలితాలు వెల్లడించాలని రాష్ట్ర హైకోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. అయితే హైకోర్టు తీర్పుపై పిటిషనర్లు సుప్రీం గడప తొక్కే అవకాశముంది. అయితే సుప్రీం కోర్టు ఎనిమిదో తేదీ వరకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయకుంటే హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 9న ముని సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిపి, ఆ రోజునే ఫలితాలు వెల్లడిస్తామని రాష్ట్ర ఎన్నిక ల కమిషనర్ రమాకాంత్ రెడ్డి చెప్పారు. ఆ రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓట్ల లెక్కింపు పక్రియ కొనసాగుతుందన్నారు. మధ్యాహ్నం 3 గంట లకు ఫలితాలు వెల్లడిస్తామని రమాకాంత్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే ఏర్పాట్లు చేశామని అన్నారు. నిజానికి బుధవారమే ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశామని, ఇప్పుడు తాజా ఆదేశాలతో నిర్ణయాన్ని 9కి మార్చామన్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాగానికి ఆదేశాలు ఇచ్చామన్నారు. మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏప్రిల్ 9న నిర్వహించి, అదే రోజు ఫలితాలు వెల్ల డించాలని హైకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. పోలింగ్ బాక్కులను భద్రప రచలేమన్న ఎన్నికల సం ఘం వాదనను పరిశీలించ కుండా ఉండలేమని కోర్టు చెప్పింది. ఎన్నికల ఫలితాల తో ఓటర్లు ప్రభావితం అవుతారన్న పిటిష్ట్రనర్ల వాదన అసంబద్దమని కోర్టు పేర్కొంది. దీంతో ఆ రోజు వరకు భద్రత పెంచాలని జిల్లా అధికారులకు సూచన చేశారు. ఒకవేళ ఏదైనా ఆదేవాలతో లెక్కింపు ప్రక్రియ ఆగితే ప్రస్తుత ఇవిఎంలను జిల్లా కేంద్రాలకు తరలించి భద్రత కొనసాగిస్తామన్నారు. ఇదిలావుంటే హైకోర్టు ఆదేశాలతో పిలిషనర్లు సుప్రీంకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. మునిసిపల్ ఎన్నికల ఫలితాలు సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపబోవంటూ ఎన్నికల సంఘం చేసిన వాదనను పరిశీలించకుండా ఉండలేమన్న హైకోర్టు, ఓటర్లు ప్రభావితం అవుతారన్న పిటిషనర్ల వాదన అసంబద్ధమని పేర్కొంది. ఓటుపై ఓ అభిప్రాయానికి రాని వ్యక్తి ఆ హక్కుకు అనర్హుడని హైకోర్టు పేర్కొంది. ఎన్నికల పక్రియ మొదలయ్యాక కోర్టులు జోక్యం చేసుకోలేవన్న న్యాయస్థానం గత నెల 3న ఇచ్చిన ఉత్తర్వులను విూరకుండా 9న ఫలితాలు వెలువరించాలని సూచిం చింది. తొలుత ఎన్నికలు 30న నిర్వహించి 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తామని ఇసి వెల్లడించింది. సుప్రీంకోర్టు జడ్పీటీసీలపై ఇచ్చిన తీర్పుతో కొందరు కోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఈ మేరకు స్పందించింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల వాయిదాపై విచారణను హైకోర్టు తొలుత మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేసింది. ఫలితాల వెల్లడిపై ఉదయం న్యాయస్థానంలో వాదనలు కొనసా గాయి. ఏప్రిల్ 10లోగా మున్సిపల్ ఎన్నికల పక్రియ పూర్తి చేయమని గతంలో న్యా యస్థానం తీర్పు ఇచ్చిందని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఇప్పుడు అదే న్యాయస్థానం గతంలో తానిచ్చిన ఆదేశాలను సవరించగలదా అని పిటిషన్ తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఏప్రిల్ 10లోగా ఎన్నికల పక్రియ పూర్తి చేయమని గతంలో తామిచ్చిన ఆదేశాలను సవరించలేమని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఆర్టికల్ 32 ప్రకారం ఇచ్చిన తీర్పును పునసవిూక్షించే అధికారం సుప్రీం కోర్టుకు ఉందని, అదే నిబంధనల ప్రకారం హైకోర్టు కూడా చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. కాగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై విూ వైఖరి తెలపాలని ఎన్నికల కమిషన్ ను కోర్టు ప్రశ్నించింది. దాంతో షెడ్యూల్ ప్రకారమే ఫలితాలు ప్రకటిస్తామని ఎన్నికల కమిషన్ తెలిపింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై సుప్రీంకోర్టులో తాము ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదని స్పష్టం చేసింది. ఎన్నికల తేదీని రీ షెడ్యూల్ చేయాలని సుప్రీంకోర్టును కోరామని తెలిపింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై సుప్రీంకోర్టు తీర్పు మున్సిపల్ ఫలితాలపై ప్రభావం చూపదని ఎన్నికల కమిషన్ అబి óప్రాయపడింది. దీంతో 9న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫళితాలు ప్రకటించాలని గతంలో ఇచ్చిన తీర్పు మేరకు ముందుకు సాగాలని ఆదేశించింది. దీంతో
ఆదివారంనాడు జరిగిన మునిసిపల్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై రాష్ట్రంలోని ఉభయ ప్రాంతాల్లో ఆసక్తి నెలకొంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం ప్రకారం ఏప్రిల్ 2వ తేదీన కౌంటింగ్ జరగవలసి ఉంది. అయితే మునిసిపల్ ఎన్నికల ఫలితాలను సాధారణ ఎన్నికలు జరిగే వరకు వెల్లడించకుండా ఆపాలని కోరుతూ టీఆర్‌ఎస్, వైసీపీలకు చెందిన వాళ్లు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ఫలితాల వెల్లడికి హైకోర్టు అనుమతిస్తే బాగుంటుందని తెలంగాణలో కాంగ్రెస్, సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ కోరుకుంటున్నాయి. ఎందుకంటే సంస్థాగతంగా బలహీనంగా ఉన్న టీఆర్‌ఎస్, వైసీపీలు మునిసిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించలేవన్నది ఆ రెండు పార్టీల అభిప్రాయం. కావచ్చు. సీమాంధ్రలో జరగనున్న మునిసిపల్ ఎన్నికలలో మూడింట రెండు వంతులు మునిసిపాలిటీలను కైవసం చేసుకుంటామని తెలుగుదేశం పార్టీ ఆశిస్తుండగా, తెలంగాణలో మెజారిటీ స్థానాలను గెలుచుకుంటామని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ రెండు పార్టీలు ఆశిస్తున్నట్టు మునిసిపల్ ఎన్నికల ఫలితాలు ఉంటే సాధారణ ఎన్నికల సరళి కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉంది. అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించినట్టుగా ఓటర్లు తెలివైన వాళ్లు. సాధారణంగా ఓటర్లు మునిసిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకైతే ఓటు వేశారో, సాధారణ ఎన్నికల్లో కూడా అదే పార్టీని ఆదరిస్తారు. ఫలితాలను బట్టి నిర్ణయాలను మార్చుకునేవారి సంఖ్య తక్కువగా ఉంటుంది. సీమాంధ్రలో మునిసిపల్ ఎన్నికల ఫలితాలపై అనుమానం రావడం వల్లనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. తనతో పాటు తల్లి, చెల్లిని కూడా మండుటెండల్లో ఆయన తిప్పారు. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్రస్థాయి నాయకులు ప్రచారం చేయరు. స్థానిక నాయకులే చూసుకుంటారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న మునిసిపల్ ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి అత్యంత కీలకమైనవి. ఎందుకంటే వైసీపీ గ్రాఫ్ పడిపోతోందని ఇప్పటికే విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీనికితోడు మునిసిపల్ ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా వస్తే సాధారణ ఎన్నికల్లో దాని ప్రభావం తన పార్టీపై పడుతుందని ఆయన ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న మునిసిపల్ ఎన్నికల ఫలితాలు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 2వ తేదీన వెల్లడి కావాల్సి ఉన్నా ఒక వారం రోజుల గ్యాప్‌తో వెల్లడి కానున్నాయి. 9న బుధవారం ఉదయం మున్సిపల్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ జరుగనుంది.