తిరుపతిలో భానుడి భగభగలు
తిరుపతి, ఏప్రిల్ 5:తిరుపతి పట్టణంలో ఉదయం పది గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీం (ఎపిఇఎంఎస్)తో స్థానికులు, యాత్రికులు తల్లడిల్లిపోతున్నారు. స్థానికులు తమ కార్యకలాపాలను పది గంటలలోపే ముగించుకుని ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాయంత్రం 5 గంటల అనంతరం ఇళ్ల నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. పట్టణంలో శీతలపానీయాల దుకాణాలను స్థానికులు, యాత్రికులు ఆశ్రయిస్తున్నారు. పట్టణంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రలు నమోదువుతున్నాయి. ఈ నెల చివరి నాటికి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా టీటీడీ అధికారులు చలువ పందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం వెలుపలికి వస్తున్న భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయం ఎదురుగా నీటిని చల్లుతున్నారు.