కాంగ్రెస్‌ తొలిజాబితా విడుదల


16 లోక్‌సభ, 110 అసెంబ్లీ సీట్లు ఖరారు
అసెంబ్లీ ఆపండి : అధిష్టానం ఫోన్‌
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 5 (జనంసాక్షి) :కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేసే తొలి జాబితాను శనివారం రాత్రి విడుదల చేసింది. 16 లోక్‌సభ, 110 అసెం బ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఖమ్మం పార్లమెంట్‌ సీటుతో పాటు తొ మ్మిది అసెంబ్లీ స్థానాలను సీపీఐకి విడిచిపెట్టి మిగతా స్థానాలను అభ్యర్థులను ఎంపి క చేసింది. శనివారం రాత్రి 10.20 గంటలకు పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ తెలంగాణ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అసెంబ్లీ సీట్లలో 29 మంది బీసీలు, 20 మంది ఎస్సీలు, తొమ్మిది మంది ఎస్టీలు, మైనార్టీలు ఐదుగురు, ఏడుగురు మహిళలు ఉన్నట్లు సమాచారం. మిగతా 40 స్థానాలను ఓసీలకు కేటాయించినట్లుగా తెలి సింది. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక వహించిన ఇద్దరు జేఏసీ నాయకులు, ఇద్దరు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు సీట్లు ఖరారు
చేసినట్లుగా సమాచారం. టీ జేఏసీ నేత అద్దంకి దయాకర్‌కు తుంగతుర్తి స్థానం, గజ్జెల కాంతంకు చొప్పదండి స్థానం కేటాయించే అవకాశమున్నట్లుగా తెలిసింది. ఓయూ జేఏసీ నేత క్రిశాంక్‌కు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ స్థానం కేటాయించినట్లు తెలిసింది. మరో విద్యార్థి నేత దరువు ఎల్లన్నకు కూడా అసెంబ్లీ సీటు ఖరారు చేసినట్లుగా సమాచారం. ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన రణదీప్‌ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తుండగా అధిష్టానం నుంచి ఫోన్‌కాల్‌ రావడంతో నిలిపివేశారు. ఎమ్మెల్యే అభ్యర్థుల్లో స్వల్ప మార్పులతో అర్ధరాత్రి తర్వాత జాబితా ప్రకటించే అవకాశాముంది. ఎంపీ అభ్యర్థుల జాబితా ఇలా ఉంది..
నిజామాబాద్‌- మధుయాష్కీ
జహీరాబాద్‌ – సురేశ్‌ షెట్కర్‌
కరీంనగర్‌ – పొన్నం ప్రభాకర్‌
పెద్దపల్లి – డాక్టర్‌ జి. వివేకానంద
వరంగల్‌ – సిరిసిల్ల రాజయ్య
మహబూబాబాద్‌ – బలరాం నాయక్‌
భువనగిరి – కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
నల్గొండ – గుత్తా సుఖేందర్‌రెడ్డి
మహబూబ్‌నగర్‌ – ఎస్‌.జైపాల్‌రెడ్డి
నాగర్‌కర్నూల్‌ – నంది ఎల్లయ్య
సికింద్రాబాద్‌ – అంజన్‌కుమార్‌యాదవ్‌
మల్కాజిగిరి – సర్వే సత్యనారాయణ
ఆదిలాబాద్‌ – నరేశ్‌ జాదవ్‌
మెదక్‌ – శ్రావణ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్‌ – సామ కిషన్‌రెడ్డి
చేవెళ్ల – కార్తీక్‌రెడ్డి
అసెంబ్లీ అభ్యర్థులు (చదివిన పేర్లు)
జనగామ – పొన్నాల లక్ష్మయ్య
హుజూర్‌నగర్‌ – ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఆందోల్‌ – దామోదర రాజనర్సింహ
మధిర – భట్టి విక్రమార్క
కంటోన్మెంట్‌ – క్రిశాంక్‌
తుంగతుర్తి – అద్దంకి దయాకర్‌
చొప్పదండి – గజ్జెల కాంతం