బ్యాలెట్ బాక్సుల భద్రత విషయం జాగ్రత్త- డీజీపీ

 

బ్యాలెట్‌బాక్సులు భద్రంః డీజీపీ

హైదరాబాద్ : జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్ బాక్సుల భద్రత విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలని అన్ని జిల్లాల ఎస్పీలకు  డీజీపీ  బి.ప్రసాదరావు ఆదివారం ఆదేశించారు. తొలి దశలో  543 మండలాల్లో  జెడ్పీటీసీలు, ఎనిమిది వేల ఎంపీటీసీలకు  పోలింగ్ ఈ రోజు ముగిసింది.  మలి విడత పోలింగ్ ఈనెల 11న జరగనుంది.
పోలింగ్  కేంద్రాల  నుంచి బ్యాలెట్ బాక్సులను నిర్ణీత మండల కేంద్రంలోని  స్ట్రాంగ్ రూమ్‌లకు చేర్చడంతో పాటు  వాటిని  కౌంటింగ్ జరిపే  తేదీ వరకు  భద్రంగా  ఉంచడానికి అవసరమైన చర్యలన్నింటినీ ఎస్పీలు, డీఎస్పీలు తీసుకోవాలని  డీజీపీ  ఆదేశించారు. తొలి దశ పోలింగ్ ముగిశాక  తాజా  పరిస్థితిని  ఆయన శాంతి భద్రతల విభాగం అదనపు డీ జీ వి.ఎస్.కె కౌముది, ఇంటెలిజెన్సీ అదనపు డీజీ ఎం.మహేందర్‌రెడ్డిలతో ఇక్కడ సమీక్షించారు.