రాములోరికి గవర్నర్‌ పట్టు వస్త్రాలు

భద్రాచలం, ఏప్రిల్‌ 8 (జనంసాక్షి) :
భద్రాద్రి రాముని కల్యాణానికి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ పట్టువస్త్రాలు సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మ ధ్య శాస్త్రోక్తంగా సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు. వేదమం త్రాల పఠనం, రామనామ సంకీర్తనం మధ్య స్వామి, అమ్మవార్ల కల్యాణమ¬త్సవాన్ని తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులతో భద్రాద్రి భక్త జనసంద్రంగా మారింది. మధ్యా హ్నం 12 గంటలకు అభిజిత్‌ లగ్నంలో స్వామి రామచంద్రుడు సీతమ్మకు మాంగళ్యధారణ గావించారు. ఈ
అపురూపమైన అరుదైన ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు ఎదురు చూశారు. రామనామజపంతో పులకించిన భక్త జనం ఈ వేడుకను కళ్లారా తిలకించారు. ప్రభుత్వం తరపున రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ స్వామివారికి పట్టువస్థాలు, తలంబ్రాలు సమర్పించారు. టీటీడీ తరపున ఛైర్మన్‌ కనుమూరి బాపిరాజు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సీతారామంచంద్రస్వామి వారి కల్యాణ మ¬త్సవాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మిథిలా కల్యాణమండపంలో స్వామి, అమ్మవార్ల కల్యాణం వైభవంగా జరిపిన తీరు రసరమ్మంగా సాగింది. స్వామివారి కల్యాణ మ¬త్సవం కన్నుల పండువగా జరపడంలో వేదపండితులు కృతకృత్యులయ్యారు. భద్రాద్రి సీతారాముల కల్యాణం సందర్భంగా దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ఈ సందర్భంగా భక్తుల మధ్య తోపులాట జరిగింది. క్యూలైన్లలో భక్తులపై పోలీసులు స్వల్ప లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు. దీంతో కొంత ఉద్రిక్తత తలెత్తింది. ఏర్పాట్లపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సీతారామంచంద్రస్వామి వారి కల్యాణ మ¬త్సవాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో కొంత తొక్కిసలాట తప్పలేదు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీరాముని కల్యాణానికి జిల్లా యంత్రాంగం అంతా సిద్ధం చేయడంతో చైత్రశుద్ధ నవమినాడు శ్రీరాముని వివాహానికి భద్రాచలంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రాద్రిలో శ్రీరామ వివాహమ¬త్సవ వేడుక జరిగే మిథిలా స్టేడియాన్ని చలువ పందిళ్లతో కప్పేశారు. చాందినీ వస్త్రాలు, తోరణాలతో మందిరాన్ని సుందరంగా అలంకరించారు. వేలాది మంది భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి భద్రాద్రి చేరుకోవడంతో భద్రాద్రి పెళ్లి వేడుకను సంతరించుకుంది. పట్టణంలో పలు ప్రాంతాల్లో స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. రాత్రి వేళలో భద్రాద్రి దేదీప్యమానంగా విద్యుత్తుకాంతులతో ధగధగలాడింది. సప్త వర్ణాల వెలుగులు, సరికొత్త రంగులతో భద్రుని కొండ కళకళలాడుతోంది. భక్తులు రాముని కల్యాణాన్ని కనులారా వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడంతో కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఇక టిటిడి భక్తి ఛానల్‌ ప్రత్యక్ష ప్రసారం చేసింది. సంప్రదాయం ప్రకారం… అభిజిత్‌ లగ్నంలో అంతరంగ వైభవంగా కల్యాణం నిర్వహించచారు. బుధవారం శ్రీరాముడికి పట్టాభిషేకం నిర్వహించనున్నారు. రాష్ట్రం నుంచే కాకుండా.. ఛత్తీస్‌గఢ్‌, ఒడిషా, మహరాష్ట్ర, మధ్యప్రదేశ్‌, తమిళనాడుకు చెందిన వేలాదిమంది భక్తులు రాములోకి వివాహానికి తరలివచ్చారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుండడంతో.. ఖమ్మం జిల్లా కలెక్టర్‌ శ్రీనరేష్‌, ఎస్పీ రంగనాథ్‌, దేవస్థానం ఈవో రఘునాథ్‌ ఆర్డీఓ వెంకటేశ్వర్లు ఏర్పాట్లు పర్యవేక్షించారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా అన్ని జాగ్రత్తలు పాటించారు. పట్టణంలోని ఆలయ కాటేజీలు, ¬టళ్లను రెవెన్యూ శాఖ స్వాధీనం చేసుకొంది. ప్రధానంగా పోలీస్‌, రెవెన్యూ, దేవాదాయ శాఖతోపాటు ఇతర శాఖలకు చెందిన అధికారులతోపాటు, విఐపి, వివిఐపిలకే వసతిని కేటాయిస్తుండడంతో సాధారణ భక్తులు ఇబ్బందుల పాలయ్యారు. వివాహ ఏర్పాట్లను అధికారులు చేపట్టినా భక్తులకు అందించాల్సిన సౌకర్యాలలో మాత్రం ఇబ్బందులు తప్పలేదు. తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు వీటన్నింటికంటే ముఖ్యంగా భక్తులకు వసతి సౌకర్యం ఇబ్బందిగా మారింది. పట్టణంలోని ఆలయ కాటేజీలు, ¬టళ్లను రెవెన్యూ శాఖ స్వాధీనం చేసుకొంది. ప్రధానంగా పోలీస్‌, రెవెన్యూ, దేవాదాయ శాఖతోపాటు ఇతర శాఖలకు చెందిన అధికారులతోపాటు, విఐపి, వివిఐపిలకే వసతిని కేటాయించడంపై భక్తులు మండిపడ్డారు. శ్రీరామనవమి సందర్భంగా గత వారం రోజులుగా భద్రాచలంలో ఘనంగా ఉత్సవాలు జరగుతున్నాయి. స్వామివారికి వివిధ రకాల పూజలు కొనసాగుతున్నాయి. వివాహ మ¬త్సవం జరిగిన తెల్లవారే మహాపట్టాభిషేకం జరగనుంది. దీనికి భక్తులు భారీగా హాజరయ్యే అవకాశం ఉంది.