అక్కా! నీవు లక్ష్మణరేఖ దాటావ్‌

నన్ను సిగరెట్‌ యాష్‌ అంటావా?

ప్రియాంక వ్యాఖ్యలపై వరుణ్‌ అభ్యంతరం

లక్నో, ఏప్రిల్‌ 15 (జనంసాక్షి) : గాంధీ నెహ్రూ కుటుంబ వారసుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మేనక గాంధీ కొడుకు, బీజే పీ యువనేత వరుణ్‌గాంధీ తాజాగా అక్క ప్రియాంక గాంధీపై విరుచుకుపడ్డారు. ప్రియాంక హుందాతనం వీడి లక్ష్మణ రేఖ దాటారని వరుణ్‌ విమర్శించారు. ద శాబ్ద కాలంగా కుటుంబ సభ్యుడిగా, ఓ రాజకీయ నేతగా తన ప్రసంగాల్లో ఎప్పుడూ అమర్యాదగా మాట్లా డలేదని, లక్ష్మణ రేఖ దాటలేదని పేర్కొన్నారు. స్వలా భం కంటే దేశ ప్రయోజనాలే మిన్నగా భావిస్తానని, తా ను ఇదే బాటలో నడుస్తానని వరుణ్‌ చెప్పారు. వరుణ్‌, మేనక బీజేపీ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తరపున ప్రియాంక ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇరు కుటుంబాల మధ్య పరస్పర విమర్శల కు కారణమేంటంటే గత వారంఅమేథిలో అన్న రాహుల్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన ప్రియాంక వరుణ్‌ దారి తప్పారని, అతను సరైన మార్గంలో నడవాలంటే ఓడించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ‘వరుణ్‌ మా కుటుంబ సభ్యుడే. అతను నాకు సోదరుడు. అయితే తమ్ముడు దారి తప్పాడు. ఓ కుటుంబంలో చిన్నవాళ్లు దారితప్పితే పెద్దలు సరైన మార్గంలో నడిపించాలి. వరుణ్‌ను సన్మార్గంలో నడిపించాల్సిందిగా విూకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని ప్రియాంక అన్నారు. ఈ వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన మేనక దీటుగా బదులిచ్చారు. వరుణ్‌ దారి తప్పాడా లేదా అన్నది ప్రజలు నిర్ణయిస్తారని, ప్రియాంక కాదన్నట్టుగా మేనక వ్యాఖ్యానించారు. వ్యక్తిగత విమర్శలు మాని ప్రజల సమస్యలపై మాట్లాడాలని వరుణ్‌ అన్నారు. వరుణ్‌గాంధీ దారి తప్పాడని ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా చేసిన వ్యాఖ్యలను వరుణ్‌గాంధీ ఖండించారు. తాను దశాబ్దకాలంగా కుటుంబసభ్యులపైగానీ, రాజకీయ నేతలపై గానీ వ్యక్తిగత విమర్శలకు దిగలేదని, తన ప్రసంగాలలో లక్ష్మణ రేఖ దాటలేదని, మర్యాదపూర్వకంగానే ప్రవర్తించానని ట్విట్టర్‌లో ప్రకటించారు. వ్యక్తిగత విమర్శలకు బదులుగా దేశంలోని నిరుద్యోగం, నిరక్షరాస్యత, పేదరికం తదితర సమస్యలపై చర్చలు జరిపితే మంచిదని ఆయన పేర్కొన్నారు. తన మంచితనాన్ని బలహీనతగా భావించవద్దని తెలిపారు. ఉపయోగకరమైన చర్చలతో భారత రాజకీయాలను ఉత్తమ మార్గంలో నడిపించాలని వరుణ్‌ కోరారు. వరుణ్‌గాంధీ మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. సోమవారం సుల్తాన్‌పూర్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తలతో మాట్లాడిన ప్రియాంక గాంధీ వరుణ్‌ను విమర్శించిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బిజెపి నాయకురాలు మేనకాగాంధీ ఆస్తులు సుమారు రూ.40 కోట్లు ఉన్నట్లు ఆమె అఫిడవిట్‌లో పేర్కొన్నారు. స్థిరాస్తులు రూ.24.95 కోట్లు, చరాస్తులు రూ.12.46 కోట్లు, రూ.40వేల విలువ చేసే లైసెన్స్‌డ్‌ రైఫిల్‌ను ఆస్తుల జాబితాలో పేర్కొన్నారు. రూ.1.47 కోట్ల విలువచేసే బంగారం, వెండి ఆభరణాలు, బ్యాంకు ఖాతాలో రూ.6 కోట్లు ఉన్నాయి. మేనకాగాంధీ ప్రస్తుతం సంజయ్‌ గాంధీ జంతు పరిరక్షణ కేంద్రం ఛైర్‌పర్సన్‌. ఆమె పేరు విూద కారు, ఇతర వాహనాలేమీ లేవు. ఆస్తులతో పాటు మేనకాగాంధీ తనపై ఉన్న కేసుల వివరాలనూ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఫిలిబిత్‌ ఎంపీ ఆమె కుమారుడు వరుణ్‌గాంధీ. ఏప్రిల్‌ 17న ఫిలిబిత్‌లో పోలింగ్‌ జరగనుంది.