శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గోల్డ్ స్మగ్లింగ్ దందా
హైదరాబాద్, ఏప్రిల్ 26 :శంషాబాద్ అంతార్జతీయ విమానాశ్రయంలో గోల్డ్ స్మగ్లింగ్ దందా యదేచ్ఛగా సాగుతోంది. దుబాయ్ కేంద్రంగా గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతోంది. మహిళల ద్వారా అలీఖాన్ గోల్డ్ స్మగ్లింగ్ చేయించినట్లు తెలుస్తోంది. అలీఖాన్‌కు ఎయిర్‌హోస్టెస్ సదాఖన్ సన్నిహితురాలు కావడంతో స్మగ్లింగ్ దందా యదేచ్ఛగా సాగినట్లు సమాచారం. స్మగ్లర్లకు కస్టమ్స్ అధికారులు సహకరిస్తున్నారని సీబీఐ విచారణలో వెల్లడైంది. దీంతో కస్టమ్స్ అధికారులు పీవీరెడ్డి, విజయ రాఘవపై బదిలీ వేటు పడింది. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టింది.