తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే : ఉత్తమ్

నల్గొండ, ఏప్రిల్ 26 : తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే, తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని టి. వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ రైతులకు రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు కృష్ణా జలాలు అందిస్తామని ఉత్తమ్ తెలిపారు.