పలు చోట్ల పోలింగ్‌ను బహిష్కరించిన గ్రామస్థులు
హైదరాబాద్, మే 7 : సీమాంధ్రలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాగా పలు గ్రామాల్లో ప్రజలు పోలింగ్‌ను బహిష్కరించారు. గ్రామాల్లో సమస్యలను పరిష్కరించలేదని వారు ఆగ్రహంవ్యక్తం చేశారు.
* శ్రీకాకుళం : కొత్తూరు మండలం పెనుగొంటివాడలో గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు. గ్రామంలో సమస్యలు పరిష్కరించలేదని వారు నిరసన వ్యక్తం చేశారు.
* తూగో : జిల్లాలోని అల్లవరం మండలం నక్కారామేశ్వరంలో గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు. మంచినీటి వసతి కల్పించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
* పగో : పాలకొల్లు మండలం గోరింటాడలో ప్యాసింజర్ ట్రైన్లను గ్రామంలో నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు.
* కృష్ణా : నూజివీడు మండలం రేగుంటలో గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
* పగో : కొయ్యలగూడెం మండలం ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనులు పోలింగ్‌ను బహిష్కరించారు. ఏజెన్సీ గ్రామాలను ఐటీడీఏలో కలపాలని వారు డిమాండ్ చేశారు.
* ప్రకాశం : రాచర్ల మండలం కొణిజర్లపల్లిలో ఇంట్లో ఉన్న మహిళపై ఎస్ఐ దాడికి పాల్పడ్డారు. దీనికి నిరసనగా స్థానికులు పోలింగ్‌ను నిలిపివేశారు.