అరవింద్ కేజ్రీవాల్‌కు జ్యూడిషియల్ కస్టడీ
గడ్కరీ పరువు నష్టం కేసులో ఢిల్లీ కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ, మే 21 (జనంసాక్షి):
నితిన్ గడ్కరీ పరువు నష్టం దావా కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌కు జ్యూడిషియల్ కస్టడీ విధిస్తూ ఢిల్లీ కోర్టు
ఆదేశించింది. దీంతో కేజ్రీవాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని కస్టడీకి పంపారు. బెయిల్ బాండ్ సమర్పించేందుకు కేజీవ్రాల్ నిరాకరించడంతో ఆయనను అదుపులోకి తీసుకోవాలని పాటియాలా న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశంతో కేజీవ్రాల్‌ను గట్టి భద్రత నడుమ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 23 వరకు ఆయన తీహార్ జైల్లోనే ఉంటారు. రూ.10 వేలకు బెయిల్ బాండ్ సమర్పిస్తే బెయిల్ మంజూరు చేస్తామని కోర్టు చెప్పినా కేజీవ్రాల్ వినిపించుకోలేదు. బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ అవినీతిపరుడంటూ కేజీవ్రాల్ గతంలో ఆరోపించారు. దీంతో కేజ్రీవాల్‌పై గడ్కరీ పరువు నష్టం దావా వేశారు. దీంతో తమకు డబ్బు సమస్య కాదని, ఇది సిద్దాంతాలకు సంబంధించిన సమస్య అని ఆప్ నేతలు పేర్కొంటున్నారు.
తక్షణమే ఎన్నికలు నిర్వహించండి
బుధవారం క్షమాపణలు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదని, వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేలా కృషి చేస్తామని చెప్పారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలను మట్టి కరిపించిన కేజ్రీవాల్ కాంగ్రెస్ మద్దతుతో సీఎం పదవీ బాధ్యతలు చేపట్టిన 49 రోజులకే పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. జనలోక్‌పాల్ బిల్లు ఆమోదానికి సరైన బలం లేకపోవడంతో అర్ధంతరంగా తప్పుకున్నారు. బుధవారం తన నివాసంలో పార్టీ సీనియర్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. తాజా పరిస్థితులు, పార్టీ ఓటమి తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ అసెంబ్లీకి తాజాగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు వెళ్లకుండా హస్తినలో మరోసారి ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా, తమ పార్టీ కాస్త నిర్లక్ష్యం వహించిందని అంగీకరించారు. అసెంబ్లీకి తాజా ఎన్నికలు నిర్వహిస్తే తాము బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. త్వరలోనే ఢిల్లీ ప్రజల్లోకి వెళ్తామని, వారిని క్షమాపణ కోరతామని తెలిపారు. ప్రజల విశ్వాసం పొంది తిరిగి పూర్తి మెజార్టీ సాధించేందుకు కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని, కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. కేజ్రీవాల్ మంగళవారం ఢిల్లీ గవర్నర్ నజీబ్‌జంగ్‌ను కలిసి అసెంబ్లీని రద్దు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన మరోమారు కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు యత్నిస్తున్నారని సమాచారం. అయితే ఆప్‌కు మద్దతిచ్చేది లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది.