ఆప్ నుంచి జారుకుంటున్న నేతలు
ఇల్మి, కెప్టెన్ గోపీనాథ్ రాజీనామా
న్యూఢిల్లీ, మే 24 (జనంసాక్షి) :
ఎన్నికల్లో పేలవ ప్రదర్శనతో ఓటమి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా జా రుకుంటున్నారు. పార్టీ అగ్రనాయకత్వంతో విబే ధించిన కెప్టెన్ గోపినాథ్, షాజియా ఇల్మీ ఆప్‌కు రాజీనామా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ముఖ్య నేతలైన షాజియా ఇల్మీ, కెప్టెన్ గోపీనాథ్‌లు శనివారం ఆ పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిం చారు. పార్టీలో అంతర్గత స్వేచ్ఛ లేదని ఇల్మీ ఆరోపించారు. పార్టీ నాయక త్వంపై ఆమె అసంతృప్తి వ్యక్తంచేశారు. గోపీనాథ్ మాట్లాడుతూ తనకు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజీవ్రాల్‌పై చాలా గౌరవం ఉందని, కానీ గత కొన్ని రోజులుగా పార్టీ నేతల కార్యకలాపాలు అసం తృప్తికి గురిచేశాయన్నారు. ఇటీవల కేజీవ్రాల్ బెయిల్ నిరాకరణపైనా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే
పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలావుంటే షాజియా ఇల్మీకి శనివారం ఢిల్లీ కోర్టు బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ కుమారుడు అమిత్ సిబల్ వేసిన పరవునష్టం దావా కేసులో ఆమె కోర్టుకు హాజరవనందున కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. అమిత్ సిబల్ తన ఫిర్యాదులో ఆప్ నేతలు అరవింద్ కేజీవ్రాల్, ప్రశాంత్ భూషణ్, షాజియా ఇల్మీల పేర్లను ప్రస్తావించారు. కపిల్ సిబల్, ఆయన కొడుకుపై ఆప్ నేతలు చేసిన అవినీతి ఆరోపణలను వ్యతిరేకిస్తూ వారు కోర్టులో పరువు నష్టం దావా వేశారు. మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి, తాజాగా పరువు నష్టం కేసులో తీహార్ జైల్లో కేజ్రీవాల్ ఉన్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు 3642 నెంబర్ కేటాయించారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ వేసిన పరువు నష్టం దావా కేసులో కేజీవ్రాల్ ఇటీవల కోర్టుకు హాజరయ్యారు. బెయిల్ తీసుకునే అవకాశం ఉన్నా కేజీవ్రాల్ నిరాకరించారు. దీంతో కోర్టు ఆయన్ను రిమాండ్కు ఆదేశించడంతో తీహార్ జైలుకు తరలించారు. కాంగ్రెస్ విధానాలతో వ్యతిరేకించిన కేజీవ్రాల్ ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే రాజీనామా చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అధికార నివాసంలో ఉండాల్సిన కేజీవ్రాల్‌కు దుడుకు స్వభావం, అనుచిత వ్యాఖ్యలతో తీహార్ జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.