తెలంగాణ తొలి మంత్రివర్గం

హైదరాబాద్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు తెలంగాణ తొలి మంత్రివర్గం కొలువుదీరింది. 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరందరితో గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. కేసీఆర్ మంత్రివర్గం….

1. మహముద్ అలీ (ఎమ్మెల్సీ) – 1953, మార్చి 2న జన్మించారు. విద్యార్హత : బి. కామ్. 2013లో టీఆర్‌ఎస్ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్ పోలిట్‌బ్యూరో సభ్యుడు, మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు.

2. డా. తాటికొండ రాజయ్య (స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే) – 1965, జూలై 12న జన్మించారు. స్వస్థలం – వరంగల్ జిల్లా తాటికొండ. విద్యార్హత – ఎంబీబీఎస్, 2009, 2011, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం.

3. నాయిని నర్సింహారెడ్డి – జననం : 1940, మే 12. స్వస్థలం : దేవరకొండ మండలం నేరేడుగొమ్ము(నల్లగొండ జిల్లా). విద్యార్హత : హెచ్‌ఎస్‌సీ. 1978, 1985, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం. సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది.

4. ఈటెల రాజేందర్ (హుజురాబాద్ ఎమ్మెల్యే)– జననం : 1964, మార్చి 20. విద్యార్హత : బీఎస్సీ, హుజురాబాద్ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక. 2004, 2008, 2009, 2010, 2014 ఎన్నికల్లో విజయం. ఏడేళ్ల పాటు టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా పని చేశారు.

5. పోచారం శ్రీనివాస్‌రెడ్డి(బాన్సువాడ ఎమ్మెల్యే) – 1949, ఫిబ్రవరి 10న జన్మించారు. విద్యార్హత – బీఈ. 1994, 1999, 2009, 2011, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం. పంచాయతీరాజ్ శాఖతో పాటు పలు కీలక శాఖల్లో పని చేసిన అనుభవం ఉంది.

6. తన్నీరు హరీష్‌రావు(సిద్దిపేట ఎమ్మెల్యే) – జననం : 1972, జూన్ 3. స్వస్థలం : కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి. 2004, 2008, 2009, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం. టీఆర్‌ఎస్‌లో కీలక నేతగా పని చేశారు.

7. పద్మారావు(సికింద్రాబాద్ ఎమ్మెల్యే) – రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

8. పట్నం మహేందర్‌రెడ్డి (తాండూరు ఎమ్మెల్యే) – నాలుగో సారి ఎమ్మెల్యేగా విజయం.

9. కె. తారకరామరావు (సిరిసిల్ల ఎమ్మెల్యే) – జననం : 1976, జూలై 26. స్వస్థలం : మెదక్ జిల్లా చింతమడక. విద్యార్హత : ఎమ్మెస్సీ, ఎంబీఏ. 2009, 2010, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపు. అమెరికాలో ఉద్యోగం వదిలి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించారు.

10. జోగు రామన్న (ఆదిలాబాద్ ఎమ్మెల్యే) – 1963, జులై 4న జన్మించారు. స్వస్థలం : జైనథ్ మండలం దీపాయిగూడ. విద్యార్హత : ఇంటర్మీడియట్, 2009, 2011, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం.

11. జగదీష్‌రెడ్డి (సూర్యాపేట ఎమ్మెల్యే) – జననం : 1965, జులై 18. స్వస్థలం : అర్వపల్లి మండలం నాగారం. విద్యార్హత : ఎల్‌ఎల్‌బీ, 2014లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు.