సీబీఐ కోర్టుకు హాజరైన మాజీ హోంమంత్రి సబిత
హైదరాబాద్: ఓఎంసీ కేసులో మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృపానందం నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఓఎంసీ కేసులో దాఖలు చేసిన చివరి అనుబంధ చార్జిషీట్‌లో సీబీఐ వీరిద్దరిని నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే.