గాంధీ ఆస్పత్రిలో సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లు

హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాకర్లు సమ్మెకు దిగారు. నిన్న రాత్రి విధుల్లో ఉన్న జూనియర్ డాక్టర్‌పై ఓ రోగి బంధువులు దాడికి పాల్పడ్డారు. రోగిని సరిగా చూడటం లేదని ఆరోపిస్తూ వీరు ఈ దాడికి పాల్పడ్డట్లు సమాచారం. డాక్టర్‌పై దాడికి నిరసనగా ఎమర్జెన్సీ సేవలు మినహా అన్ని సేవలను జూడాలు బహిష్కరించారు. ఇలా తరచూ తమపై దాడులు జరుగుతూఉంటే విధులు నిర్వహించలేమని జూడాలు అంటున్నారు. తమకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వీరు సమ్మె చేపట్టారు.