చర్చలు సఫలం

సమ్మె విరమించిన జూనియర్‌ వైద్యులు

హైదరాబాద్‌ : జూనియర్‌ వైద్యులు సమ్మె విరమించారు. జూనియర్‌ వైద్యులతో ప్రభుత్వం తరఫÛన ¬ంమంత్రి నాయిని, ఉపముఖ్యమంత్రి రాజయ్య జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో సమ్మె విరమిస్తున్నట్లు జూడాల ప్రతినిధులు తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై విచారణ జరుపుతామని రాజయ్య హామీ ఇచ్చారు. జూడాలు ప్రత్యేక భద్రత కావాలని అడిగారని.. ఆస్పత్రిలో సీసీ కెమెరాలు ఉండాలని కోరారని తెలిపారు. జూడాలు కోరినట్లు వారికి వెంటనే భద్రత కల్పిస్తామని రాజయ్య వెల్లడించారు. ఎవరు భౌతిక దాడులు చేసినా అది నేరమేనని.. ఇకమీదట దాడులు జరగకుండా పూర్తి రక్షణ కల్పిస్తామని మంత్రి నాయిని తెలిపారు.