రూ.8లక్షల విలువైన గంజాయి స్వాధీనం

హైదరాబాద్‌: వరంగల్‌ జిల్లా కురవి మండలంలో ఆదివారం ఉదయం పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మోదుగులగూడెంలో అక్రమంగా తరలిస్తున్న రూ.8లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.