చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో మోడీ సమావేశం
అంతర్జాతీయ వేదికలపై కలిసి పనిచేయాలని నిర్ణయం
ఫోర్ట్‌లేజా(ఏజెన్సీస్): చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో భారత ప్రధాని నరేంద్ర మోడి భేటీ అయ్యారు. ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని విడిగా జిన్ పింగ్‌తో సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, సరిహద్దు సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవడం వంటి వాటిపై చర్చించినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ వేదికలపై ఇరు దేశాలు కలిసి పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.
ఈ సందర్భంగా ఆసియా మరియు పసిఫిక్ నేతల (ఏపిఇసి) సమావేశంలో పాల్గొనవలసిందిగా మోడీని చైనా ప్రభుత్వం ఆహ్వానించింది. దీనికి ప్రధాని కూడా అంగీకరించినట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి అక్బరుద్దీన్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో గుజరాత్ రాష్ట్ర అభివృద్ధిని ప్రస్తావిస్తూ చైనా అధ్యక్షుడు మోడిపై ప్రశంసలు కురిపించారు.