మాసాయిపేట దుర్ఘటన: చికిత్స పొందుతూ చిన్నారి మృతి
హైదరాబాద్: మాసాయిపేట దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తరుణ్ అనే చిన్నారి సోమవారం మృతి చెందాడు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద స్కూల్ బస్సును రైలు ఢీకొన్న ఘటనలో 14మంది విద్యార్థులతో సహా 16మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే.