9వ పిఆర్‌సిని ప్రకటించాలి

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 9 : గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు టి.వి.రావు ఆరోపించారు. అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటూ ఇతరులకంటే ఎక్కువగా  బాధ్యతరహితంగా పనిచేస్తున్న ఐటీడీఏ ఉపాధ్యాయులు చాలిచాలని వేతనాలతో పని చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గురుకుల పాఠశాల ఉపాధ్యాయులతో సమానంగా జీతబత్యాలను చెల్లించాలని, ఆశ్రమ పాఠశాల అన్నింటికీ కొత్త పోస్టులను కేటాయించి, 9వ పిఆర్‌సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజల అకాంక్షకు అనుగుణంగా పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.