9వ రోజుకు చేరిన సిరిసిల్ల నేతన్నల దీక్ష

కరీంనగర్‌: సిరిసిల్ల పవర్‌ లూమ్‌ కార్మికుల సమ్మె ఇవాళ్టికి తొమ్మిదవ రోజుకు చేరింది. కూలీ ఒప్పందం కాలపరిమితి ముగిసినా యాజమాన్యలు పట్టించుకోక పోవడంతో వారు సమ్మెకు దిగారు. యాజమాన్యం కార్మికుల మధ్య చర్చలు జరుగుతున్నా ఇంత వరకు కొలిక్కి రాలేదు. చర్చలు ఇంకా  కొనసాగుతున్నాయి. కాగా, కార్మికుల సమ్మెతో కార్ఖానాలు మూతపడ్డాయి. దాదాపు ముప్పై వేల మర మగ్గాలు మూగబోయాయి.