900 కోట్లతో గ్రావిూణ మంచినీటి పథకం
గిరిజన గ్రామాల్లో సోలార్ ఆధారిత తాగునీటి పథకం
అధికారులతో సవిూక్షలో మంత్రి లోకేశ్ వెల్లడి
అమరావతి,ఆగస్ట్14(జనం సాక్షి): ఈ ఏడాది రూ. 900 కోట్లతో మరిన్ని గ్రామాలకు తాగునీరు అందిండచంతో పాటు గిరిజన ప్రాంతాల్లో సోలార్ ఆధారిత తాగునీటి సరఫరా చేయాలని మంత్రి లోకేష్ తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టిన స్వజల్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సూచించారు. విజయనగరం, విశాఖ, కడప జిల్లాలకు స్వజల్ పథకం వర్తిస్తుందని తెలిపారు. నీటి పథకాలు లేని గ్రామాలకు 45 శాతం కేంద్ర నిధులు వినియోగించుకోవాలని మంత్రి పేర్కొన్నారు. పంచాయతీరాజ్, గ్రావిూణ నీటి సరఫరాపై ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ మంగళవారం ఉదయం సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ సుజల కార్యక్రమంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అద్దంకి, చీమకుర్తి, కనిగిరిలో రూ. 5.28 కోట్ల అంచనాతో ఎన్టీఆర్ సుజల ఎ/-లాంట్లు ఏర్పాటు చెయ్యాలని సమావేశంలో నిర్ణయించారు. కొత్తగా ఏర్పాటు చేసే 103 ఎన్టీఆర్ సుజల క్లస్టర్లను త్వరగా పూర్తి చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు.గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు వేగవంతం చెయ్యాలని ఆదేశించారు. తాగునీటి పథకాల పర్యవేక్షణకు యాప్ ప్రారంభించాలని, నాణ్యత వివరాలు ఎప్పటికప్పుడు యాప్‌లో పొందుపరచాలని సూచించారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాల్లో..చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల ఏర్పాటు చెయ్యాలన్నారు. స్వచ్ఛ్ సర్వేక్షన్‌లో టాప్ 10లో ఏపీవి 5 జిల్లాలు ఉండాలని అధికారులకుమంత్రి లోకేష్ తెలిపారు.