932వ రోజుకు చేరుకున్న దీక్ష

ఆదిలాబాద్‌, జూలై 23 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో రాజకీయ పార్టీలు అన్ని చిత్తశుద్ధితో వ్యవహరించి తమ నిజాయతీని తెలియజేయాలని ఐకాస నేతలు డిమాండ్‌ చేశారు. తెలంగాణను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రీలే దీక్షలు సోమవారంనాటికి 932వ రోజుకు చేరుకున్నాయి. వారు మాట్లాడుతూ, తెలంగాణ సాధించే విధంగా పార్టీలన్నీ ఉద్యమించాలని అన్నారు. తెలంగాణలో నెలకొన్న సమస్యలకు ప్రత్యేక రాష్ట్రం ఒకటే పరిష్కార మార్గమని అన్నారు. ప్రజల ఆకాంక్షను పార్టీ నేరవేర్చకపోతే తెలంగాణ ప్రాంతంలో ఆ పార్టీలకు ఉలికి ఉండదని అన్నారు. రాష్ట్రం ఏర్పాటు అయ్యేంతవరకు ఉద్యమం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.