వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ స్వాములకు భిక్ష

ఆర్మూర్, (జనం సాక్షి) : ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నవనాథ సిద్దుల గుట్టపై నియోజకవర్గంలో హనుమాన్ మాల ధరించిన స్వాములకు, భక్తులకు ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వినయ్ రెడ్డి శుక్రవారం భిక్ష నిర్వహించారు. శ్రీరాముడి ఆలయంలో హనుమాన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.వినయ్ రెడ్డి ఆహ్వానం మేరకు ఆర్మూర్ డివిజన్, నియోజకవర్గ అధికారులు విచ్చేసి బిక్ష ప్రసాదాన్ని స్వీకరించారు.ఈ బిక్షలో సుమారు 200 మంది పైగా హనుమాన్ మాలధారణ స్వాములు పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీరాముడి, హనుమాన్ ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని వినయ్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజా గౌడ్, ఏసిపి వెంకటేశ్వర రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజు, ఎమ్మార్వో సత్యనారాయణ, ర్మూర్ టౌన్ సిఐ సత్యనారాయణ గౌడ్,మండలాల అధికారులు, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ గ్రంథాలయ చైర్మన్ మార చంద్రమోహన్, పెర్కిట్ సొసైటీ చైర్మన్ పెంట బోజారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్,నిజాంసాగర్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ యాళ్ల సాయ రెడ్డి,ఆలూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కెర విజయ్, మాజీ సర్పంచులు రవి గౌడ్, మారుతి రెడ్డి, మాజీ కౌన్సిలర్లు బండారి ప్రసాద్, తాటి హన్మండ్లు, సీనియర్ నాయకులు జితేందర్ రెడ్డి, ముత్యం రెడ్డి,సొసైటీ డైరెక్టర్లు మల్లారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.