అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి : ఎమ్మెల్యే వివేక్

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆదివారం సంత సమీపంలో గల బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను అంబేద్కర్ సంఘ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెన్నూరు ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా పాల్గొని పంచశీల జెండాను ఎగరవేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. వచ్చే అంబేద్కర్ జయంతి నాటికి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి వడ్నాల శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, మునిసిపల్ మాజీ చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి, సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్, గాండ్ల సమ్మయ్య, యాకూబ్ అలీ, మారపెల్లి రాజయ్య, అంబేద్కర్ సంఘం నాయకులు రామిల్ల మల్లేష్, బైరమల్లె మొగులయ్య, ఆగయ్య, కాంపెల్లి పూర్ణచందర్, బొడ్డు వెంకటేష్, శ్రీనివాస్, మురళి, సరేష్ తదితరులు పాల్గొన్నారు.