రాహుల్ క్షమాపణ చెప్పాలి
` అమిత్‌షా డిమాండ్
` కొత్త చట్టాలతో బాధితులకు రక్షణ
` విపక్షాలది అనవసర రాద్ధాంతమని వ్యాఖ్య
దిల్లీ(జనంసాక్షి): కొత్త నేర, న్యాయ చట్టాలతో త్వరగా న్యాయం జరుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి అవి అమల్లోకి వచ్చిన తరుణంలో ఆయన విూడియాతో మాట్లాడారు. వాటిపై విపక్ష నేతలు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.స్వాతంత్య్రం వచ్చిన 77 సంవత్సరాల తర్వాత దేశానికి పూర్తిస్థాయి స్వదేశీ న్యాయవ్యవస్థ లభించిందని అమిత్ షా వెల్లడిరచారు. అందులోని నిబంధనలతో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు లబ్ధి పొందనున్నారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా బ్రిటిష్‌కాలం నాటి పలు సెక్షన్ల స్థానంలో కొత్త వాటిని తీసుకువచ్చామని తెలిపారు. మహిళలపై హింసకు సంబంధించిన నేరాలపై మాట్లాడుతూ.. బాధితురాలి ఇంటివద్దే ఆమె వాంగ్మూలం రికార్డు చేసేందుకు కొత్త చట్టాలు అనుమతిస్తాయని, ఆన్‌లైన్‌లోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకునే వీలు ఉందని గుర్తుచేశారు. ‘’మూకదాడులకు సంబంధించి ఇంతకాలం ప్రత్యేక నిబంధన ఏదీ లేదు. వీటిలో దానిని నిర్వచించాం. రాజద్రోహం అనే పదాన్ని తొలగించాం. అయితే దేశ సార్వభౌమత్వం, సమగ్రతలకు భంగం కలిగించే చర్యలు శిక్షార్హమైనవి’’ అని వెల్లడిరచారు.కొత్త చట్టాల కింద అర్ధరాత్రి 12.10 గంటలకు గ్వాలియర్‌లో తొలి కేసు నమోదైందని, అది ద్విచక్ర వాహన దొంగతనానికి సంబంధించినది హోం మంత్రి తెలిపారు. దీనికి ముందు దిల్లీలో వీధి వ్యాపారిపై తొలి కేసు నమోదైందని జాతీయ విూడియా కథనాలు వెల్లడిరచాయి. తాజాగా దానిపై మంత్రి స్పష్టత ఇచ్చారు.’’కొత్త న్యాయ చట్టాలపై విపక్ష నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారు. వాటిపై లోక్‌సభలో 9.30 గంటలు, రాజ్యసభలో 6 గంటలు చర్చించాం. నాలుగు సంవత్సరాల చర్చ తర్వాతే వాటిని తీసుకువచ్చాం. కొత్త చట్టాలతో త్వరగా న్యాయం జరుగుతుంది. నేర విచారణ నిర్దిష్ట సమయంలో పూర్తవుతుంది. వాటిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. అలాగే తమ అభిప్రాయాలు చెప్పాలని ఎంపీలకు లేఖ కూడా రాశా’’ అని అమిత్ షా తెలిపారు. గతంలో పోలీసుల హక్కులకు రక్షణ ఉందని, ఇప్పుడు ఫిర్యాదు చేసిన, బాధిత వ్యక్తి హక్కులకు కూడా రక్షణ లభిస్తుందని చెప్పారు. బ్రిటిష్ పాలన నాటి చట్టాలు శిక్షకు ప్రాధాన్యమిస్తే, తాము న్యాయానికి పెద్దపీట వేశామని మరోసారి గుర్తు చేశారు.మన దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. వాటి స్థానంలో గతేడాది పార్లమెంటు ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్(బీఎస్‌ఏ) అమల్లోకి వచ్చాయి.