ఆర్మూర్ లో దారుణ ఘటన

బిచ్చగాడిని బలి తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగి

ఆర్మూర్, ఫిబ్రవరి జనం సాక్షి:

ఓ ప్రభుత్వ ఉద్యోగి బిచ్చగాడిని బలి తీసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద కారు అద్దాలు తుడుస్తూ డబ్బులు ఆశించే యాచకున్ని కాలితో తన్నడంతో టిప్పర్ కింద పడి దుర్మరణం చెందాడు. ప్రభుత్వ ఉద్యోగి కాలితో తన్నిన ఘటన వీడియో సంచలనంగా మారింది. సిసి ఫుటేజ్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగి ఉదాంతం బయటకు వచ్చింది. ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట మృతుడి బంధువులు ఆందోళన చేపట్టారు. ఆ ప్రభుత్వ ఉద్యోగి ఓ మండల డిప్యూటీ తాసిల్దారుగా, టీఎన్జీవో లో పదవిలో ఉన్నట్టు సమాచారం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రవికుమార్ వివరాలను వెల్లడించారు.