రేషన్ కార్డుదారులకు బ్యాగులు అందజేత..

సదాశివపేట జనవరి 2(జనం సాక్షి)రేషన్ షాపులో బియ్యం తెచ్చుకోవాలంటే సాధారణంగా వెంట బ్యాగ్ తీసుకెళ్తారు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు పర్యావరణహిత బ్యాగులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా శుక్రవారం మండలంలోని వెంకటాపురం, ఇశ్రితాబాద్ గ్రామాల్లో గ్రామ సర్పంచులు ఒగ్గు శ్రీనివాస్, బలరాం అనిత శ్రీనివాస్ ఆధ్వర్యంలో రేషన్ కార్డుదారులకు బ్యాగులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతినెల రేషన్ బియ్యం కోసం వెళ్లేటప్పుడు బ్యాగులు తీసుకెళ్తే సరిపోతుందన్నారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుతో పాటు అనేక సంక్షేమ పథకాలను అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచులు మహేందర్, కట్టెకోసే శ్రీనివాస్, మండల బీసీ సెల్ అధ్యక్షుడు కృష్ణ, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఖలీల్, వార్డ్ మెంబర్లు, రేషన్ కార్డ్ దారులు పాల్గొన్నారు.