అందరికీ ఆదర్శంగా ఉంటా

బచ్చన్నపేట డిసెంబర్ 24 ( జనం సాక్షి):
బచ్చన్నపేట సర్పంచ్ అల్వాల నర్సింగరావు
జనగామ జిల్లా బచ్చన్నపేట మండల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన అల్వాల నర్సింగరావును బుధవారం మెకానిక్ యూనియన్ అధ్యక్షులు కర్నాల వేణుగోపాల్ ఎక్స్ ఎం పి టి సి. ఉపాధ్యక్షులు ఎండి చెక్కు. కోశాధికారి మేక యాదగిరి. సభ్యులు ఆరే రాము. క్రాంతి కుమార్. తందల భాస్కర్. నవీన్ కుమార్. రక్షణ భాస్కర్. కుమారస్వామి. నాగరాజు. అనిల్ కుమార్. అజయ్ తదితరులు ఘనంగా సన్మానించారు. అనంతరం సర్పంచ్ అల్వాల నరసింహారావు మాట్లాడుతూ స్థానిక ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసి ఆదర్శంగా ఉంటానని అన్నారు. సన్మానించిన మెకానిక్ యూనియన్ కు కృతజ్ఞతలు తెలిపారు



