(BECIL)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్ దరఖాస్తులు ఈ నెల 28 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 96 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో రేడియోగ్రాఫర్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, పేషెంట్ కేర్ కోఆర్డినేటర్, ల్యాబ్ అటెండెంట్ వంటి పోస్టులు ఉన్నాయి.
మొత్తం ఖాళీలు: 96
ఇందులో రేడియోగ్రాఫర్ 22, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ 51, పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ 8, ఫెబోటమిస్ట్ 1, ల్యాబ్ అటెండెంట్ 14 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. బీఎస్సీ రేడియాలజి, ఎమ్మెల్టీ, లైఫ్‌సైన్స్, మెడికల్ ల్యాబోరేటరీ టెక్నాలజిస్ట్, ఇంటర్ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ అభ్యర్థులకు రూ.450
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 28