తల్లిపాలే బిడ్డకు మేలు

బోనకల్ , ఆగస్టు 02,(జనంసాక్షి):బోనకల్ లో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు మధిర ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని బోనకల్ -1 సెక్టార్ నందు బోనకల్ అంగన్వాడి కేంద్రం ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు శుక్రవారం ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.అంగన్వాడి కేంద్రం పరిధిలో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు తల్లిపాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ రమాదేవి, పంచాయతీ కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ తల్లిపాలు వలన సంపూర్ణ ఆరోగ్యంతో పాటు, శిశువుకు రోగ నిరోధక శక్తి పెరగాలంటే తల్లిపాలు తప్పక పట్టించాలని, డబ్బా పాలు ,పోత పాలు పట్టించడం వలన శిశువు ఎదుగుదల లోపంతో పాటు భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.నవజాత శిశువులకు తల్లిపాలే శ్రేష్టమన్నారు. తల్లీబిడ్డల శ్రేయస్సుకు తల్లిపాల వినియోగం ఎంత అవసరమో వివరించారు. పుట్టిన బిడ్డకు మొదటి గంటలోనే తల్లిపాలు పట్టించాలన్నారు. మొదటి ఆరు నెలలు తల్లిపాలు శ్రేష్టమన్నారు. డబ్బాపాలు వద్దు తల్లిపాలు ముద్దు అనే నినాదంతో ముందుకు సాగాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో బోనకల్ పంచాయతీ కార్యదర్శి డి కిరణ్, ఏఎన్ఎం సరస్వతి, ఉపాధ్యాయులు బాబు, అంగన్వాడీ టీచర్స్ శిరీష, రమాదేవి, నాగమణి ,అంగన్వాడి ఆయాలు, ఆశాలు దుర్గా, లీల, పలువురు గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.