ఓటమి చెందిన సర్పంచ్ అభ్యర్థులకు బిఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుంది…

 

 

 

 

 

చెన్నారావుపేట, డిసెంబర్ 26 (జనం సాక్షి):

భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తా…

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి…

స్థానిక సర్పంచ్ ఎన్నికలలో గ్రామాలలో ఓటమిపాలైన బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులకు బిఆర్ఎస్ పార్టీ, నేను ఎల్లవేళలా అండగా ఉంటామని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందిన బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులకు ధైర్యం నింపేందుకు పరామర్శ యాత్ర చేపట్టారు.ఈ సందర్భంగా ఓటమి చెందిన అభ్యర్థులకు, వారి కుటుంబ సభ్యులకు బిఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కోనాపురం గ్రామంలో చిలువేరు రవి (చిరంజీవి), ఖాదర్ పేటలో కూస రమ రవికుమార్, ఎల్లయ్యగూడెంలో కందికొండ విజయ్ కుమార్,
బోజేర్వులో గడ్డల బిక్షపతి,
ధర్మ తండలో బోడ బద్రు,
శంకరం తండలో భూక్య స్వాతిశ్రీనులను పరామర్శించారు. అనంతరం మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ
ఓటమి చెందిన అభ్యర్థులకు పార్టీలో భవిష్యత్తులో సముచిత స్థానం కల్పించి గౌరవిస్తామని హామీ ఇచ్చారు.ప్రజాసేవయే లక్ష్యంగా ఇదే పోరాట స్ఫూర్తితో గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే మిమ్మల్ని ఆశీర్వదిస్తారని పిలుపునిచ్చారు.
అధికార దుర్వినియోగం అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు, అధికారులు చాలా చోట్ల బిఆర్ఎస్ విజయాలను తారుమారు చేశారని మండిపడ్డారు.
ఎన్నికల ఫలితాల పై కోర్టులో సవాల్ చేస్తామని న్యాయపరంగా చట్టబద్ధంగా పోరాడి గెలుస్తామని స్పష్టం చేశారు. పోలీసుల అరాచకాలకు అడ్డులేకుండా పోయిందన్నారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఫలితాలను తారుమారు చేసినా కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు బాల్నె వెంకన్న, మండల ఎన్నికల కన్వీనర్ జక్క అశోక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల కుమారస్వామి, బోడ బద్దు నాయక్, సోషల్ మీడియా మండల ఇన్చార్జి బోడ మురళి నాయక్, తదితరులు పాల్గొన్నారు.