cరైతుల సోలార్ బ్యాటరీలు చోరీ..రైతుల సోలార్ బ్యాటరీలు చోరీ.
. భైంసా రూరల్ మార్చ్ 20జనం సాక్షీ
ఆందోళనల్లో రైతులు. అడవి జంతువుల భారీ నుంచి పంటలను రక్షించు కోటానికి రైతులు తమ వ్యసాయ క్షేత్రాల చుట్టు వేసుకున్న సోలార్ కంచే 23 బ్యాటరీలను దొంగలు ఎత్తుకెళ్లిన సంఘటన ఆదివారం రాత్రి నిర్మల్ జిల్లా భైంసా సబ్ డివిజన్ పరిధిలో చోటుచేసుకుంది.బాధిత రైతులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తానూర్ మండలం భోసి గ్రామానికి చెందిన రైతులు రబీ సీజన్లో వేసిన మొక్కజొన్న పంటను అడవి జంతువుల భారీ నుంచి రక్షించుకోటానికి 23 సోలార్ విద్యుత్ కంచెలను ఏర్పాటు చేసుకున్నారు. రాత్రిళ్ళు కంచెకు విద్యుత్ సరఫరాను అందించి ఉదయం తొలగిస్తారు.అందులో భాగంగా ఆదివారం రాత్రి10గం” ల సమయంలో దత్తాత్రేయ అనే రైతు తన సోలార్ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు వెళ్లగా దుండగులు సోలార్ ప్యానల్ తాళాన్ని పగులగొట్టి అందలి బ్యాటరీని దింగిలించినట్లు గుర్తించాడు.విషయం తెలిసిన ఇతర రైతులు సైతం తమ వ్యవసాయ క్షేత్రాల వద్దకు వెల్లి చూడగా, మొత్తం 23 మంది రైతుల సోలార్ విద్యుత్ బ్యాటరీలు దొంగలు ఎత్తుకెళ్లారు. దొంగతనానికి గురైన బ్యాటరీల విలువ రూ”లక్ష పైనే ఉంటుంది. ఒక్కో సోలార్ ప్యానల్ కిట్ ధర మార్కెట్టులో రూ”10 వేల నుంచి 20 వరకు ఉంటుంది. గతంలో సైతం దొంగలు రైతుల ట్రాక్టర్ల బ్యాటరీలు వ్యవసాయ పంపు మోటార్లు కెబుల్లను ఎత్తుకెళ్లినట్లు ఇక్కడి రైతులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.పోలీసు అధికారులు దుండగులను పట్టుకుని ఈలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బోసి గ్రామ రైతులు కోరుతున్నారు.