ప్రాథమికోన్నత పాఠశాలలో చలిమంట

చెన్నారావుపేట, జనవరి 2 (జనం సాక్షి):
ఉపశమనం పొందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు…
అసలే ఓవైపు తీవ్రమైన చలి… మరోవైపు మంచు దుప్పటి కప్పేసింది.. దీంతో చలి తీవ్రతను తట్టుకోలేక ఉపాధ్యాయులు విద్యార్థులు చలిమంటను వేశారు. మండలంలోని ఎల్లాయగూడెం గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం ఉదయం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు విద్యార్థులు ఒకవైపు చలి తీవ్రత మరోవైపు తీవ్రమైన పొగ మంచును తట్టుకోలేక పాఠశాల ఆవరణలో చలిమంటను వేశారు. అరగంట పాటు చలిమంటను కాగి ఉపశమనం పొందారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంగోతు భద్రయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

