కొనలేం…తినలేం..!

 

 

 

 

 

వామ్మో…మేడారంలో అవి కొనాలంటే రూ. 500 లకు పై మాటే…

మంగపేట, మేడారం జనవరి 29(జనంసాక్షి)ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారలమ్మల జాతర. ఈ జాతరలో భక్తులు ఏది కొనాలన్నా ధరలు బగ్గుమంటున్నాయి. ఈ కోవలోనే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే పుచ్చకాయ ధరలను చూస్తే కొనలేం…తినలేం అనే విధంగా మారింది. జాతర లో ఒక్క పుచ్చకాయను కొనాలంటే వాటి ధర రూ.500 ల పై మాటే… జాతర లో వాటిని చూడగానే వామ్మో.. పుచ్చకాయా అంటూ భక్తులు జంకుతున్నారు.