చలో వరంగల్ పోస్టర్ల ఆవిష్కరణ

ఆర్మూర్ (జనం సాక్షి) : ఈనెల 27న వరంగల్ లో జరిగే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని చలో వరంగల్ పోస్టర్ల ఆవిష్కరణను ఆర్మూర్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ రాజేశ్వర్ రెడ్డి  బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. బిఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ శాఖ అధ్యక్షుడు పూజ నరేందర్ ఆధ్వర్యంలో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.వేలాది పార్టీ కార్యకర్తలు కుల సంఘాల నాయకులు,పార్టీ ముఖ్యనాయకులు,యూత్ అధ్యక్షులు,వార్డ్ అధ్యక్షులు,కార్యదర్శులు పాల్గొనాలని రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు పోల సుధాకర్, మాజీ సర్వసమాజ్ అధ్యక్షుడు సుంకరి రవి,మహేష్, మాజీ కౌన్సిలర్ లింబాద్రిగౌడ్, నాయకులు నచ్చు చిన్నరెడ్డి,సత్యం,లతీఫ్,నర్మే నవీన్,యూత్ అధ్యక్షులు గుంజల పృద్వి,అగ్గు క్రాంతి,టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు జన్నపల్లి రంజిత్,సాంబాడి ఆనంద్,బోగ గిరీష్,శ్రీకర్, సైఫ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.