స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో బాల సైంటిస్టుల ఇన్ స్పైర్ 2024

ఖమ్మం, డిసెంబర్ 21 (జనంసాక్షి): స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో శనివారం విద్యార్థులు ఏర్పాటు చేసిన ఇన్ స్పైర్ 2024… చిన్నారుల మేధస్సును చాటి చెప్పింది. సృజనాత్మకతతో అణువు నుంచి అంతరిక్షం దాకా 200 పైగా ఎగ్జిబిట్స్ ఇన్స్పైర్లో ప్రదర్శించారు. అంతరిక్ష యానం, పర్యావరణ పరిరక్షణ, సోలార్ ఎనర్జీ, ఆహారము, రవాణా రంగం, సౌర కుటుంబం, వాతావరణ మార్పులు, దేవాలయాలు, మానవ శారీరక వ్యవస్థ, అంతర్భాగాలు, వ్యవసాయం, తదితర అంశాలలో విద్యార్థులు పలు రకాల ఎగ్జిబిట్స్ రూపొందించి ప్రదర్శించారు. ఈ ఇన్ స్పైర్ ఎక్స్ పోలో ముఖ్యంగా చిన్నారి లౌక్య కోల్ మైన్స్ ఎగ్జిబిట్ ను, అభయ్ కృష్ణ హైడ్రాలిక్ బ్రిడ్జ్, కీర్తన అయోధ్య రామ మందిరం ఎగ్జిబిట్ ను, మనీష్ శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థను, నిరూప ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ వ్యవస్థను, ఆద్య హెరిటేజ్ ఆఫ్ హైదరాబాద్, ప్రణీత వాయు కాలుష్యం ఎగ్జిబిట్ ను, దియా ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థను, ఉత్కర్ష్ సోలార్ వ్యవస్థను, దీపక్ లేయర్స్ అండ్ సాయిల్స్, మోక్షిత్ కృష్ణ స్టేట్ అండ్ క్యాపిటల్స్ ఎగ్జిబిట్ ను, దక్ష్ స్మార్ట్ సిటీస్, హేయన్షు స్మార్ట్ విలేజెస్ ఎగ్జ్బిట్స్ , ప్రజ్ఞ గ్యాస్ లీకేజీ ప్రాజెక్టు,దిత్య శివన్య క్లైమేట్ చేంజ్ వ్యవస్థ ను ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. పాఠశాల విద్యార్థులు ఏర్పాటుచేసిన ఎగ్జిబిట్స్ అందరినీ అబ్బురపరిచాయి, ఎల్కేజీ, యూకేజీ చిన్నారుల నుండి మొదలుకొని ఐదో తరగతి విద్యార్థుల వరకు ప్రదర్శించిన సైన్స్ నమూనాలను విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సందర్శించి విద్యార్థులను ప్రశంసించారు. తొలుత పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య అధ్యక్షతన జరిగిన ఇన్ స్పైర్ 2024 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిఎంఅండ్ హెచ్ఒ కళావతి బాయి హాజరై మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న సజనాత్మకతను వెలికితీయడానికి ఈ ఎక్స్ పోలు దోహదపడతాయన్నారు, ఈ ఎక్స్ పోలో విద్యార్థులు అన్ని రకాల వైజ్ఞానిక అంశాలలో నమూనాలను తయారుచేసి వారి మేధస్సును తెలియజేశారని తెలిపారు. చిరుప్రాయం నుంచి విద్యార్థులకు స్ఫూర్తినిచ్చెల ఇన్ స్పైర్ కార్యక్రమాన్ని నిర్వహించిన పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చిదిద్దడం హర్షనీయమన్నారు.
పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. తమ పాఠశాలలో విద్యార్థులను చదువుతోపాటు క్రీడ సాంస్కృతిక, వైజ్ఞానికా ఒలంపియాడ్ ,మహనీయుల పర్వదినాలు, స్కూల్ డే ఇన్ స్పైర్ లతో, విద్యార్థులను నిత్యం ప్రోత్సహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మోతరపు శ్రావణి సుధాకర్, పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, పాఠశాల ప్రిన్సిపల్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.